చాయ్వాలా మోదీకి.. 15 లక్షల సూటా! | chaiwala modi is wearing 15 lakhs suit now, says rahul gandhi | Sakshi
Sakshi News home page

చాయ్వాలా మోదీకి.. 15 లక్షల సూటా!

Published Sat, Sep 19 2015 3:25 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

చాయ్వాలా మోదీకి.. 15 లక్షల సూటా! - Sakshi

చాయ్వాలా మోదీకి.. 15 లక్షల సూటా!

ఒకప్పుడు చాయ్వాలాగా ఉండే ప్రధానమంత్రి నరేంద్రమోదీకి ఇప్పుడు రూ. 15 లక్షల సూటు ఎక్కడి నుంచి వచ్చిందని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రశ్నించారు. బిహార్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన చంపారన్ జిల్లాలో శనివారం మధ్యాహ్నం జరిగిన బహిరంగ సభలో ప్రసంగించారు. మోదీపైన, బీజేపీ.. ఆర్ఎస్ఎస్లపైన పూర్తిస్థాయిలో విరుచుకుపడ్డారు. రాహుల్ ఏమన్నారంటే..

  • మోదీ చాయ్ వాలాగా ఉండేవాళ్లు, కానీ ఆయన బట్టలు మారాయి.
  • ఆయన ప్రధాని కాగానే 15 లక్షల సూటు వేసుకున్నారు.
  • మేం రైతుల తరఫున పోరాడుతున్నాం. కానీ ప్రధాని మాత్రం పేదలను కలవట్లేదు.
  • కేవలం సూటుబూటు వాళ్లనే కలుస్తున్నారు.
  • తాను, తన సూటుబూటు స్నేహితులు కలిసి దేశాన్ని మార్చేస్తామంటారు.
  • ప్రతి భారతీయుడికి అకౌంటులో 15 లక్షల నగదు ఇప్పిస్తామంటారు.
  • రైతులకు 50 శాతం అధిక మద్దతుధర ఇస్తామంటారు.
  • అధిక ధరలను తగ్గిస్తామని చెబుతారు.
  • 2 కోట్ల మందికి ఉద్యోగాలు ఇస్తామంటారు
  • ఏడాది దాటింది ఎవరికైనా 15 లక్షలు వచ్చాయా, ఉద్యోగాలు వచ్చాయా, ధరలు తగ్గాయా
  • గత ఎన్నికలప్పుడు మోదీ వచ్చారు. చక్కెర మిల్లులను పునరుద్ధరిస్తామని చెప్పారు.. కానీ ఇప్పటికైనా అది ప్రారంభమైందా?
  • భూసేకరణ చట్టం వద్దని ఎవరూ అనట్లేదు.
  • రైతులు, కూలీలు కూడా ఇదే మాట చెబుతున్నారు.
  • కొంత కాలం క్రితం ఏమాత్రం ధర పలకని ఇక్కడి భూములు.. ఇప్పుడు లక్షలు, కోట్లు పలుకుతున్నాయి.
  • మోదీ మేకిన్ ఇండియా అంటున్నారు.. భారతదేశంలోనే తయారుచేయిస్తామని, 2 కోట్ల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెబుతున్నారు
  • ఏడాది అయిపోయింది గానీ, ఏ ఒక్కరికీ ఇప్పటివరకు ఉద్యోగం వచ్చిన పాపాన పోలేదు.
  • పాఠశాలలను, ఆస్పత్రులను ప్రైవేటుపరం చేసేశారు. ఉచితవిద్యను ఆపేశారు. ఎవరైనా పేదలు అనారోగ్యానికి గురైతే ప్రైవేటు ఆస్పత్రికే వెళ్లాల్సి వస్తోంది.
  • పిల్లలకు చదువు కూడా దొరకట్లేదు.
  • ఛత్తీస్గఢ్లో పీడీఎస్ స్కాం జరిగింది. వేల కోట్ల సొమ్ము చోరీ అయింది.
  • మోదీ అక్కడికెళ్లి, అవినీతి అరికట్టామని చెబుతారు.
  • మధ్యప్రదేశ్లో వ్యాపం స్కాం జరిగింది. ముఖ్యమంత్రి భార్య, ఉన్నతాధికారులు అందరూ అందులో ఉన్నారు.
  • అక్కడ కూడా అవినీతి లేదనే చెబుతారు
  • సుష్మా స్వరాజ్ భర్త, కూతురు లలిత్ మోదీ కోసం పనిచేస్తారు.
  • రాజస్థాన్లో వసుంధరా రాజె లలిత్ మోదీకి వ్యాపార భాగస్వామి
  • కానీ మోదీ మాత్రం తాను లంచాలు తినను, తిననివ్వననే చెబుతారు
  • మేం పేదలు, బలహీనులను రక్షిద్దామని అనుకుంటాం. మోదీ గారి సూటుబూటు స్నేహితుల నుంచి బీహార్ను రక్షిద్దామని అనుకుంటున్నాం.
  • ఇక్కడ బీజేపీ ప్రభుత్వం వస్తే ఢిల్లీ నుంచి, గుజరాత్ నుంచి పెద్దపెద్ద సూట్లు వేసుకుని, భూములు లాగేసుకుంటారు.
  • మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వం ఉంది కానీ, మీరు అక్కడికి వెళ్తే మీరు మరాఠీ మాట్లాడరు కాబట్టి వెళ్లిపోవాలంటారు.
  • ఇవీ వాళ్ల ఆలోచనలు.
  • మా ప్రభుత్వం వస్తే బిహార్లోనే ఉద్యోగాలు కల్పిస్తాం.
  • పేదలు ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. రిజర్వేషన్లు కల్పిస్తాం. యువతకు 4 లక్షల రూపాయల విద్యారుణం ఇస్తాం.
  • పటేల్, నెహ్రూ, గాంధీ అందరూ మీ కోసం పోరాడారు. మీ మాట వినేవారు. మీ మాటలు అర్థం చేసుకోవాలనుకునేవాళ్లు. కాంగ్రెస్ కూడా అలాగే ఉంటుంది. ఆర్ఎస్ఎస్, బీజేపీ వాళ్లు మాత్రం వేరేలా ఉంటారు.
  • పేదలకు ఏమీ తెలియదని అనుకుంటారు.
  • రాజస్థాన్లో.. చదువు లేకపోతే వాళ్లు స్థానిక ఎన్నికల్లో పోటీ చేయకూడదని అంటున్నారు. ఇదీ వాళ్ల ఆలోచన.
  • వాళ్లు వచ్చినా మీ చేతులు పట్టుకోరు. తమ సూట్లు నలగకూడదని అనుకుంటారు.
  • మేం సూట్లు వదిలేసి లాల్చీ పైజమాలే వేసుకుంటాం.
  • మీకు మేం కావాలో.. వాళ్లు కావాలో మీరే నిర్ణయించుకోండి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement