'మోదీగారు పని మొదలుపెట్టండి' | 'Stop Lying, Start Working': Rahul Gandhi Takes Swipe at PM | Sakshi
Sakshi News home page

'మోదీగారు పని మొదలుపెట్టండి'

Published Mon, Oct 26 2015 7:00 PM | Last Updated on Thu, Jul 18 2019 2:11 PM

'మోదీగారు పని మొదలుపెట్టండి' - Sakshi

'మోదీగారు పని మొదలుపెట్టండి'

మోతిహరి (బిహార్): బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఒకేరోజు అటు ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ఇటు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ హోరాహోరి ప్రచారాన్ని నిర్వహించారు. మూడో దశ ఎన్నికలు జరుగనున్న మోతిహరిలో రాహుల్‌గాంధీ సోమవారం ప్రచారాన్ని నిర్వహిస్తూ.. ప్రధాని మోదీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. మోదీ అబద్ధాలు చెప్పడం మాని.. పనిచేయడం మొదలుపెట్టాలని సూచించారు.

'దేశ ప్రజలు తెలివైన వారని ప్రధానికి ఇప్పటికీ తెలిసింది. ఆయన అబద్ధాలు గుర్తించే తెలివి వారికి ఉంది. మోదీగారు ఇప్పటికైనా అబద్ధాలు మాని.. పనిమొదలుపెట్టండి' అని రాహుల్‌ పేర్కొన్నారు. 'మంచి రోజులు వస్తాయని ఆయన హామీ ఇచ్చారు. ధరలను తగ్గిస్తామన్నారు. కానీ ఈ రోజు పప్పు కిలో ధర రూ. 200లకు చేరింది. అయినా మోదీ మౌనంగా ఉంటున్నారు' అని విమర్శించారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement