
'ముఖ్యమంత్రి క.వి. అయిపోయారు'
రాష్ట్రంలో ఉన్న సమస్యలేవీ చంద్రబాబుకు కనపడటం లేదని, ఆయన క.వి. అయిపోయారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. అంటే ఆయనకు ఏదీ కనపడదు, వినపడదని ఎద్దేవా చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరాహార దీక్ష శిబిరంలో ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..
- చంద్రబాబుకు గుంటూరు జిల్లాలో 30 వేల ఎకరాలు తీసుకుని వ్యాపారం చేసుకోవాలని తప్ప మరో ఆలోచన లేదు
- ప్రత్యేక హోదా వచ్చిన రాష్ట్రాలన్నీ బ్రహ్మాండంగా బాగుపడ్డాయి.
- మాకు ఈ రాష్ట్ర అభివృద్ధి అక్కర్లేదు, ఈ ఐదేళ్లు కాలం గడుపుకొని సంపాదించుకుంటే చాలన్న ఏకైక ధ్యేయంతో చంద్రబాబు పనిచేస్తున్నాడు
- ఎన్నికలకు ముందు అనేక హామీలిచ్చి కేవలం 5 లక్షల ఓట్ల తేడాతో అధికారం చేపట్టాడు
- వెంకయ్య నాయుడు రాజ్యసభ సాక్షిగా కూడా పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని అడిగాడు
- ఇప్పుడు అలాంటాయన ఏం మాట్లాడుతున్నారో కూడా అందరికీ తెలుసు
- ప్రత్యేక హోదాను అడ్డుకుంటున్న శత్రవులు చంద్రబాబు, వెంకయ్య
- నా జోలికి రావద్దు, ప్రత్యేక హోదా ఇచ్చినా లేకపోయినా పర్వాలేదని కేంద్రం వద్ద చంద్రబాబు చెబుతున్నాడు
- ఓటుకు కోట్ల కేసు రాకూడదని అంటున్నాడు. దానిమీదే మోదీ ముందు మోకరిల్లి, కుయ్యో మెర్రో అని అడుక్కుంటున్నాడు
- వెంకయ్య నాయుడు కూడా ప్రత్యేక ప్యాకేజీలు ఇచ్చి ప్రాజెక్టులు కడతామని చెబుతున్నారు
- పోలవరం ప్రాజెక్టుకు 50 వేల కోట్లు కేటాయించాల్సి ఉండగా.. ఇప్పటికి కేవలం 700 కోట్లు మాత్రమే ఇచ్చారు. మరి ఐదేళ్లలో ఎలా పూర్తవుతుంది?
- దానికి బదులు 1400 కోట్లు ఖర్చుపెట్టి పట్టిసీమ ప్రాజెక్టు ఎందుకు చేపట్టినట్లు?
- ఆ ప్రాజెక్టుతో రాయలసీమకు నీళ్లు ఇస్తామని అంటాడు. కానీ జీవోలో మాత్రం ఆ నీళ్లు కేవలం రాజధానికి, అక్కడి పరిశ్రమలకు మాత్రమేనని స్పష్టంగా ఉంది
- అసలీ పట్టిసీమ పనిచేస్తుందా అని అడుగుతున్నాను.
- బుడమేరుకు బలేరావు చెరువు నుంచి నీళ్లు తరలించి, నదుల అనుసంధానం చేశానని నీళ్లలో మునిగి తేలి స్వీట్లు కూడా తిన్నారు
- నిజంగా అవి గోదావరి జలాలే అయితే జిల్లా పేరు నిలబెట్టారని మేం కూడా అంటాం. కానీ తప్పుడు మాటలు, తప్పుడు వాగ్దానాలతో రాయలసీమ వాసులను మోసం చేస్తున్నారు