హైదరాబాద్: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో గోదావరి పుష్కరాల్లో తొక్కిసలాట దుర్ఘటనకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైతిక బాధ్యత వహించి తన పదవికి రాజీనామా చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణ డిమాండ్ చేశారు. శుక్రవారం బొత్స మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అధికారులు చంద్రబాబు సేవలో తరించడం వల్లే తొక్కిసలాట జరిగి ప్రాణ నష్టం జరిగిందని అన్నారు. తొలిరోజు జరిగిన తొక్కిసలాటలో 27 మంది దుర్మరణం చెందిన సంగతి తెలిసిందే.