శ్రీవారి పాదాల చెంత జన్మించినందుకే ... | Chandrababu Visits Tirumala With His Family | Sakshi
Sakshi News home page

శ్రీవారి పాదాల చెంత జన్మించినందుకే ...

Published Sun, Oct 18 2015 1:46 PM | Last Updated on Sat, Jul 28 2018 3:30 PM

శ్రీవారి పాదాల చెంత జన్మించినందుకే ... - Sakshi

శ్రీవారి పాదాల చెంత జన్మించినందుకే ...

తిరుమల : కలియుగ దైవం శ్రీవెంకటేశ్వర స్వామి వారి పాదాల చెంతనే తాను జన్మించానని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు తెలిపారు. అందుకే రాజధాని నిర్మాణ బాధ్యత తనకు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం తిరమలలో నారా లోకేష్, బ్రహ్మాణీల తనయుడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న చంద్రబాబు నాయుడు అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు.

దేశంలోని పవిత్ర నదీ జలాలను రాజధాని నిర్మాణంలో ఉపయోగిస్తామని తెలిపారు. అలాగే ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని అమరావతిని ప్రపంచ దేశాల రాజధానుల సరనస నిలబెడతామని చంద్రబాబు తెలిపారు. చంద్రబాబు నాయుడు మనవడు దేవాన్ష్ అన్నప్రాసన కార్యక్రమానికి భువనేశ్వరితోపాటు నందమూరి బాలకృష్ణ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. చంద్రబాబు నాయుడు చిత్తూరు జిల్లా కుప్పం తాలుకా నారావారి పల్లెలో జన్మించిన సంగతి తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement