ఛోటా రాజన్ తరలింపు ఆలస్యం?
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్ను భారత్కు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశముంది. ఇండోనేసియా నుంచి మంగళవారం రాత్రి ఛోటా రాజన్ను స్వదేశానికి తరలించాలని భారత అధికారులు ప్రయత్నించారు. అయితే బాలి సమీపంలో అగ్ని పర్వతం పేలడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజన్ను భారత్కు తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ అధికారులు ఇండోనేసియా వెళ్లారు.