under world don
-
పాకిస్తాన్లో దావూద్ ఇబ్రహీం.. ‘మోదీ పట్టుకుంటారా ?’
ముంబైలో గ్యాంగ్‌స్టర్, కీలక కేసుల్లో నిందితుడైన దావూద్ ఇబ్రహీం గురించి కీలక విషయం బయటకు వచ్చింది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కీలక సమాచారం బయటపెట్టింది. దాయాది దేశం పాకిస్తాన్‌లోనే దావూద్ ఇబ్రహీం ఉన్నట్టు తెలిపింది. అయితే, కొన్ని రోజుల నుండి దావూడ్ సంబంధిన అన్ని విభాగాలపై ఈడీ ఫోకస్ పెట్టింది. అందులో భాగంగానే మనీలాండరింగ్ కేసులో విచారణకు హాజరుకావాలని దావూద్ సోదరి హాసీనా పార్కర్ కుమారుడు అలిశా పార్కర్‌కు ఈడీ సమన్లు జారీ చేసింది. అనంతరం పార్కర్‌ను విచారించే క్రమంలో దావూద్ పాకిస్తాన్‌లోని కరాచీలో ఉన్నాడని అతడు తెలిపాడు. దీంతో దావూద్ పాకిస్తాన్‌లోనే ఉన్నాడంటూ పలు సందర్భాల్లో బయటకు వచ్చిన వార్తలు నిజమయ్యాయి. ఇక, ఈడీ విచారణ సందర్భంగా పార్కర్.. ‘‘నేను పుట్టుక ముందే తన మామ(దావూద్ ఇబ్రహీం) ముంబై వదిలిపెట్టి వెళ్లిపోయారు. అనంతరం వాళ్లు భారత్‌ను వదిలి.. పాకిస్తాన్లో ఉంటున్నట్టు మా బంధువుల ద్వారా తెలిసింది. అయితే, ఇంతకు ముందు కొన్నిసార్లు ఈద్, ఇతర పండుగలకు దావూర్ భార్య మెహ్జబీన్.. తన భార్య ఆయేషా, తన సోదరితో మాట్లాడింది.’’ అని చెప్పినట్టు ఈడీ అధికారులు వెల్లడించారు. దీంతో దావూద్.. పాకిస్తాన్లో ఉన్నాడని రుజువైంది. ఈడీ ప్రకటన బయటకు వచ్చిన తర్వాత.. దావూద్ ఇబ్రహాంను పట్టుకునేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని మహారాష్ట్ర హోం మంత్రి దిలీప్ వాల్సే డిమాండ్ చేశారు. In a big revelation, Haseena Parkar's son Alishah has told the Enforcement Directorate that underworld don Dawood Ibrahim is living in Pakistan's Karachi. Read more: https://t.co/TJtKSCm0ow#DawoodIbrahim pic.twitter.com/9bs8EW4xmT — TIMES NOW (@TimesNow) May 24, 2022 అంతకుముందు.. మహారాష్ట్ర మైనార్టీ వ్యవహారాల మంత్రి, ఎన్సీపీ సీనియర్ నేత నవాబ్ మాలిక్‌ను అక్రమార్జన కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసింది. అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో భాగంగా మాలిక్‌ను అరెస్టు చేసిన విషయం తెలిసిందే. పీఎంఎల్ఏ (అక్రమార్జన నిరోధక చట్టం) కింద మాలిక్ స్టేట్మెంట్ను రికార్డు చేశామని, ఆయన సరైన సమాధానాలు ఇవ్వకపోవడంతో అదుపులోకి తీసుకున్నామని ఈడీ అధికారులు చెప్పారు. మాలిక్‌ను ప్రత్యేక కోర్టు ముందు హాజరుపరుచగా.. కోర్టు ఈడీ కస్టడీ విధించింది. దీంతో నవాబ్ మాలిక్ వ్యవహారంలో బీజేపీకి నిజంగా దమ్ముంటే దావూద్‌ను పట్టుకోవాలని ప్రధాని మోదీకి ఉద్ధవ్ థాక్రే సవాల్ విసిరారు. Central Govt should take action on it. Till now the location was not known but now if the location is clear then the Central govt should take it seriously and take the action: Maharashtra Home Minister Dilip Walse Patil on Dawood Ibrahim pic.twitter.com/V56OvHK6pI — ANI (@ANI) May 24, 2022 ఇది కూడా చదవండి: బీజేపీకి దమ్ముంటే దావూద్ ఇబ్రహీంను పట్టుకొని చంపండి.. మోదీకి సవాల్ -
చోటా రాజన్ మృతిపై రూమర్స్.. ఆర్జీవీ ట్వీట్ వైరల్
అండర్ వరల్డ్ డాన్ చోటా రాజన్ కరోనాతో మరణించాడంటూ శుక్రవారం మధ్యాహ్నం మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆ వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని, చోట రాజన్ బతికే ఉన్నాడని తీహార్ పోలీసులు స్పష్టత ఇచ్చారు. కరోనాతో బాధపడుతన్న చోటా రాజన్ని ఏయిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నామని చెప్పారు. ఇదిలా ఉంటే..చోటా రాజన్ మృతి చెందాడని వార్తలు రాగానే.. వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ ఓ ట్వీట్ చేశారు. ‘చోటా రాజన్ని కరోనా చంపేసింది. డీ కంపెనీలో రెండో స్థానంలో ఉన్నాడనే భయం లేకుండా రాజన్ని కరోనా చంపేసింది. ఆయన దాన్ని ఎందుకు హతం చేయలేదో నాకు అర్థం కావట్లేదు. దావూడ్ ఇప్పుడు ఎలా ఫీలవుతున్నాడో’అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు. COVID killed CHOTA RAJAN and it dint even care that he is no.2 man of D COMPANY ..I wonder why he dint shoot it ?😳.. Seriously speaking I wonder how DAWOOD IBRAHIM is feeling 🥲🥲 — Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021 ఇక చోటా రాజన్ మృతి చెందలేదని పోలీసులు స్పష్టం చేయగానే ఆర్జీవీ ఊపిరి పీల్చుకున్నాడు. చోటా రాజన్ మరణ వార్త ఒట్టి పుకారని, ఆయన కోవిడ్‌తో బాధపడుతూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని మరో ట్వీట్ చేశాడు. అలాగే అతనికి బెడ్, ఆక్సిజన్ అందాలని కోరుకుంటున్నానని తెలిపాడు. Apparently the news about Chota Rajan’s death is a rumour .. So it’s not Covid but it’s the rumour mongers who killed him ..I stand corrected ..He’s just admitted in hospital for Covid ..Hope he gets bed and oxygen — Ram Gopal Varma (@RGVzoomin) May 7, 2021 చదవండి: ఆ వార్తలు అవాస్తవం.. చోటా రాజన్ బ్రతికే ఉన్నాడు! -
లేటు వయసులో దావూద్ ఘాటు ప్రేమ!
ఇస్లామాబాద్ : అండర్ వరల్డ్ డాన్, 1993 ముంబై వరుస పేలుళ్ల ఘటనలో ప్రధాన నిందితుడు దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ సినీనటితో ప్రేమాయణం నడుపుతున్నట్టుగా తెలుస్తోంది. ముంబైలో ఉన్న సమయంలోనూ గతంలో ఆయన పలువురు బాలీవుడ్ హీరోయిన్లతో సంబంధాలు కొనసాగించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం పాకిస్తాన్లో తలదాచుకుంటున్న 60 ఏళ్ల దావూద్ గత మూడేళ్లుగా పాక్ నటి మోహ్విష్ హయత్‌తో ప్రేమాయాణం నడుపుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆమెకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అందించే 'తమ్ గా ఏ ఇంతియాజ్' అవార్డుకు 2019లో ఎంపికైందని పలు కథనాల్లో వెల్లడైంది. చిన్నా చితకా పాత్రలు పోషించే మోహ్విష్‌కు ప్రభుత్వం ప్రతిష్టాత్మక పురస్కారం కట్టబెట్టడంతో.. అసలు ఆమె ఎవరు? ఏమేం సినిమాల్లో నటించిందన్న విషయాలపై నెటిజన్లు ఆరా తీస్తున్నారు. అయితే మోహ్విష్తో సంబంధాలపై మీడియా కథనాలు రావడంపై దావూద్ ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. (పాక్‌లోనే దావూద్..!) ఐటమ్ గాళ్‌గా తన సినీ కెరీర్ ఆరంభించిన మోహ్విష్ హయత్ పేరు 2019లో అవార్డు రావడంతో ఒక్కసారిగా మారుమోగిపోయింది. దీంతో పెద్ద సినిమాల్లోనూ ఈ 37 ఏళ్ల భామకు అవకాశాలు వస్తున్నాయట. ఇదంతా దావూద్ సిఫార్సు వల్లేనని అక్కడి మీడియా కోడైకూస్తోంది. ప్రస్తుతం కరాచీలో అత్యంత లగ్జరీ బంగ్లాలో దావూద్ ఉన్నట్లు తెలుస్తోంది. రెండేళ్ల నుంచి మోహ్విష్ సైతం ఖరీదైన బంగ్లాల్లో నివసిస్తోందట. అంతేకాకుండా దావూద్ ప్రేయసిగా చలామణి అవుతూ పలు పార్టీలను కూడా నిర్వహిస్తోందట. కాగా, మోహ్విష్‌కు, దావూద్‌కు మధ్య 27 ఏళ్ల వ్యత్యాసం ఉంది. అయినప్పటికీ లేటు వయసులో ఘాటు ప్రేమ అంటూ ఈ జంటపై నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. (సినిమాలపై దావూద్ ప్రభావం) -
పాక్‌లోనే దావూద్..!
ఇస్లామాబాద్: పూటకో మాట మార్చే తన బుద్ధిని పాకిస్తాన్ మరోసారి బయట పెట్టుకుంది. అండర్ వరల్డ్ డాన్, ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీం తమ గడ్డ మీదే ఉన్నాడని చెప్పినట్టుగానే చెప్పి యూ టర్న్ తీసుకుంది. దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్‌లోనే ఉన్నాడని ఎప్పట్నుంచో భారత్ చేస్తున్న వాదనలు నిజమేనని తొలిసారిగా ఆ దేశ మీడియా వెల్లడించింది. దావూద్ పాక్ గడ్డ మీదే ఉన్నాడని మీడియా కథనాల ద్వారా అయినా అంగీకరించడం ఇదే మొదటిసారి. పాక్ ప్రభుత్వం ఆంక్షలు విధించిన నిషిద్ధ 88 ఉగ్రవాద సంస్థలు, వారి నాయకుల జాబితాను శనివారం వెల్లడించింది. అందులో భారత్ మోస్ట్ వాంటెడ్ నేరగాడు దావూద్ ఇబ్రహీం పేరు కూడా ఉంది. తమ దేశంలో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థలు, వ్యక్తులపైనే ఆంక్షలు ఉంటాయి కాబట్టి దావూద్ పాక్‌లోనే ఉన్నాడని అంగీకరించినట్లే. కానీ ఎప్పటి మాదిరిగానే పాక్ కుటిల బుద్ధిని బయటపెట్టుకుంటూ దావూద్ తమ గడ్డ మీద లేడని పాత పాటే పాడుతోంది. మీడియా కథనాలు నిరాధారమైనవీ, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయంటూ పాక్ విదేశాంగ శాఖ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి నిబంధనల ప్రకారమే ఉగ్ర సంస్థలపై ఆంక్షలు విధించామని, ఇది సాధారణ ప్రక్రియనేనని తెలిపింది. గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికే.. ఉగ్రవాద సంస్థల్ని పెంచి పోషిస్తున్నందుకుగాను ఫ్రాన్సు రాజధాని పారిస్ కేంద్రంగా పనిచేస్తున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాక్స్‌ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) సంస్థ పాకిస్తాన్‌ను 2018 జూన్‌లో గ్రే లిస్ట్‌లో ఉంచింది. 2019 చివరికల్లా ఉగ్రవాద నిర్మూలనకు కృషి చేయాలని గడువు విధించింది. ఆ తర్వాత కరోనా సంక్షోభంతో గడువు పెంచింది. 2020 జూన్ నాటికి కూడా పాక్ ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో గ్రే లిస్టులోనే కొనసాగించాలని నిర్ణయించింది. గ్రే లిస్ట్‌లో ఉంటే అంతర్జాతీయంగా ఎలాంటి ఆర్థిక సాయం పాక్‌కి అందదు. దీంతో గ్రే లిస్ట్ నుంచి బయటపడడానికి పాకిస్తాన్ శుక్రవారం హఫీజ్ సయీద్, మసూద్ అజర్, దావూద్ ఇబ్రహీంతో పాటుగా 88 ఉగ్ర సంస్థలు, వాటి నాయకుల ఆస్తులు, బ్యాంకు అకౌంట్లు జప్తు చేస్తూ ఆదేశాలు జారీ చేసినట్టుగా ది న్యూస్ కథనం వెల్లడించింది. జమాత్ ఉద్ దవా, జైషే మహమ్మద్, తాలిబన్, అల్‌ఖైదా, హక్కానీ గ్రూప్ వంటి సంస్థల అన్ని రకాల ఆర్థిక లావాదేవీలపై ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసినట్టుగా ఆ కథనం పేర్కొంది. 1993 ముంబై పేలుళ్ల సూత్రధారి దావూద్ ఇబ్రహీంను అప్పగించాల్సిందిగా అప్పగించాల్సిందిగా భారత్ ఎప్పట్నుంచో డిమాండ్ చేస్తోంది. ó∙కరాచీలోనే తలదాచుకున్నాడని ఆధారాలను బయట పెట్టినా తమ వద్ద లేడని బుకాయిస్తూ వస్తోంది. -
‘డీ’ గ్యాంగ్ నయా డాన్.. అనీస్!
సోదరుడిని వారసుడిగా ప్రకటించనున్న దావూద్! * 60వ బర్త్‌డే పార్టీలో ప్రకటించే అవకాశం ముంబై: మాఫియా డాన్, ముంబై పేలుళ్ల కీలక నిందితుడు దావూద్ ఇబ్రహీం రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తున్నాడా?వారసుడిని ప్రకటించనున్నాడా?.. ఈ ప్రశ్నలకు ముంబైలోని ‘డీ’ కంపెనీ సన్నిహిత వర్గాలు అవుననే అంటున్నాయి. ‘డీ’ కంపెనీ వర్గాల సమాచారం మేరకు.. సోదరుడు అనీస్ అహ్మద్‌కు డీ కంపెనీ పగ్గాలు అప్పగించేందుకు దావూద్ నిర్ణయించుకున్నారు. ఇప్పటివరకు డీ గ్యాంగ్ సీఈఓగా ఉన్న దావూద్ ముఖ్య అనుచరుడు చోటా షకీల్ ఇకపైనా అదే బాధ్యతల్లో కొనసాగుతారు. అనీస్, షకీల్‌లు కలిసి, దావూద్ సలహ సంప్రదింపుల మేరకు ‘డీ’ కంపెనీ మాఫియా బిజినెస్‌ను నిర్వహిస్తారు. పలు దేశాల్లో డ్రగ్స్, అక్రమ ఆయుధాల అమ్మకం, బెట్టింగ్, హవాలా తదితర కార్యకలాపాల ద్వారా వెయ్యి కోట్ల డాలర్ల(సుమారు రూ. 66 వేల కోట్లు) మాఫియా సామ్రాజ్యాన్ని దావూద్ నిర్మించారు. దావూద్ సోదరుల్లో అనీస్, హుమాయున్, ముస్తఖీమ్.. దావూద్‌తోనే ఉంటున్నారు. వారిలో ముస్తఖీమ్ దీర్ఘకాల వ్యాధితో బాధపడ్తూ, ఇంట్లోనే ఉంటున్నాడు. హుమాయున్ ‘డీ’ వ్యవహారాల్లో అంత క్రియాశీలకంగా లేడు. అందువల్ల అనీస్‌కే వారసత్వ పగ్గాలు అప్పగించవచ్చు. దావూద్ రిటైర్మెంట్ నిర్ణయం వెనుక ఆయన భార్య మెహజబీన్, ఇద్దరు పిల్లలు మహరూఖ్, మొయిన్‌లు ఉండొచ్చని భావిస్తున్నారు. అనారోగ్యంతో బాధ పడ్తున్న దావూద్‌కు విశ్రాంతి అవసరమన్న ఉద్దేశంతో వారు బాధ్యతలను తగ్గించుకోవాలంటూ దావూద్‌పై ఒత్తిడి తెచ్చి ఉండొచ్చనుకుంటున్నారు. రహస్యం.. అంగరంగ వైభవం తన 60వ పుట్టిన రోజును దావూద్ శనివారం కరాచీలో వైభవంగా జరుపుకుంటున్నాడు. వేదిక ఎక్కడ అనేది అత్యంత రహస్యంగా ఉంచుతున్నారు. అతిధులకు కూడా ఆ వివరాలు ఇవ్వడం లేదు. బర్త్‌డే వేడుకలకు కాసేపు ముందు పికప్ చేసుకుంటామని వారికి చెప్పినట్లు సమాచారం. దావూద్ పాక్‌లో ఉండడు! ముంబై: ‘దావూద్ పాక్‌లో ఉండడు.. తరచుగా పాక్‌కు వస్తాడని వింటుంటాను.’ అని కరాచీకి చెందిన మీడియా గ్రూప్ ‘డాన్’ సీఈఓ హమీద్ పేర్కొన్నారు. ముంబై ప్రెస్ క్లబ్ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. -
షష్టిపూర్తి రోజున మాఫియాడాన్ వారసుడి ప్రకటన?
పాకిస్థాన్‌లో ఉండి.. ముంబై నేర సామ్రాజ్యాన్ని శాసిస్తున్న మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం ఇక రిటైర్ అవుదామని చూస్తున్నట్లుంది. శనివారం షష్టిపూర్తి చేసుకోబోతున్న దావూద్.. ఆరోజు తన వారసుడిని ప్రకటించే అవకాశం ఉందని నిఘా వర్గాలు చెబుతున్నాయి. తన సోదరులలో ఒకరిని వారసుడిగా చేయొచ్చని, అందులో అనీస్ అహ్మద్‌కు అవకాశాలు ఎక్కువని అంటున్నారు. ఇక దావూద్ గ్యాంగులో అత్యంత కీలకమైన వ్యక్తి, గ్యాంగు సీఈవోగా చెప్పుకొనే ఛోటా షకీల్‌కు అతడి స్థానం యథాతథంగా ఉంచుతారని తెలుస్తోంది. అయితే, సాధారణంగా దావూద్ ఏం చేసినా ముంబైలోని బిగ్షాట్లకు తెలిసిపోతుంది. వాళ్లు కూడా 'భాయ్' దిగిపోతున్న విషయం తమకు తెలియదనే అంటున్నారు. కేవలం కొద్దిమందికి మాత్రమే తెలిసిన ఈ విషయాన్ని తన 60వ పుట్టినరోజు సందర్భంగా జరిగే పార్టీలో ప్రకటిస్తాడని అంచనా. పార్టీ ఎక్కడ జరుగుతుందన్న విషయం కూడా టాప్ సీక్రెట్‌గా ఉంచారు. పార్టీకి పిలిచినవాళ్లకు కూడా ఎక్కడన్న విషయం చివరి నిమిషంలోనే చెబుతున్నారు. డ్రగ్స్, బెట్టింగ్, హవాలా, ఆయుధాల స్మగ్లింగ్ లాంటి వ్యవహారాల ద్వారా 66 వేల కోట్ల రూపాయల డి కంపెనీ సామ్రాజ్యం తన అనారోగ్యం కారణంగా కుప్పకూలకూడదని దావూద్ భావిస్తున్నట్లు తెలిసింది. రాబోయే రెండు మూడేళ్ల పాటు మాత్రమే తాను కూడా ఉండి.. వచ్చేవాళ్లకు కాస్త మార్గదర్శనం చేయాలన్నది దావూద్ ప్లాన్ అంటున్నారు. దావూద్ సోదరుల్లో నూరుల్ హక్ అలియాస్ నూరా చనిపోయాడు. ఇక్బాల్ కస్కర్‌ను దుబాయ్ నుంచి వెనక్కి పంపేశారు. దాంతో మరో ముగ్గురు సోదరులు మాత్రమే ఉన్నారు. వాళ్లు అనీస్, హుమాయూన్, ముస్తఖీమ్. వీళ్లలో అనీస్ తప్ప మిగిలిన ఇద్దరూ గ్యాంగు కార్యకలాపాల్లో అంత చురుగ్గా ఉండరు. ముస్తఖీమ్ ఒక ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో అతడు ఇంటికే పరిమితం. దాంతో ఇక ఛోటా షకీల్ సాయంతో అనీస్ గ్యాంగు పగ్గాలు చేపట్టడం దాదాపు ఖాయంగా కనిపిస్తోంది. కూతుళ్ల ఒత్తిడి దావూద్ ఇబ్రహీంకు మహరూఖ్, మోయిన్ అనే ఇద్దరు కూతుళ్లున్నారు. వాళ్లలో మహరూఖ్ను మాజీ క్రికెటర్ జావేద్ మియాందాద్ కొడుకు జునైద్ మియాందాద్‌కు ఇచ్చి పెళ్లి చేశాడు. మోయిన్ నిఖార్సైన ముస్లిం. వీళ్లిద్దరూ కూడా తమ తండ్రిని ఇక పని ఒత్తిడి తగ్గించుకోవాలని చెప్పినట్లు తెలుస్తోంది. ఎవరో ఒకరికి గ్యాంగు అప్పగించి ఇక విశ్రాంతి తీసుకోవాలని దావూద్ భార్య మెహజబీన్ కూడా ఎన్నాళ్ల నుంచో పోరు పెడుతోంది. అందుకే ఇక రిటైర్మెంటు గురించి డాన్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. -
మాఫియా డాన్‌కు జైల్లో రాచమర్యాదలు
జైల్లో తనను చిత్రహింసలు పెడుతున్నారని, జీవితాన్ని దుర్భరంగా మార్చారని బయటకు చెబుతున్న అండర్ వరల్డ్ డాన్ అబూ సలేం.. నిజానికి జైల్లో రాజభోగాలు అనుభవిస్తున్నాడు. అక్కడ అతగాడికి సొంత పనిమనిషి ఉన్నాడు, తోటి ఖైదీలకు పార్టీలు ఇస్తుంటాడు. దాని కోసం ఒకోసారి ఇంటి నుంచి ఆహారం తెప్పిస్తే.. కొన్నిసార్లు కేఎఫ్‌సీ నుంచి చికెన్ కూడా స్మగుల్ చేయించుకుంటున్నాడు. ఈ విషయాలన్నింటినీ అబూసలేంను గతంలో చిత్రహింసలు పెట్టారన్న ఆరోపణలతో విచారణ ఎదుర్కొంటున్న తలోజా జైలు సూపరింటెండెంట్ హరిలాల్ జాదవ్ వెల్లడించారు. జాదవ్ తనను హింసించారంటూ టాడా కోర్టులో అబూసలేం 16 పేజీల అఫిడవిట్ దాఖలు చేశాడు. దాంతో జైళ్ల ఐజీ బిపిన్ కుమార్ సింగ్ ఈ వ్యవహారంపై దర్యాప్తు ప్రారంభించారు. అయితే, సలీం వ్యాఖ్యలను ఖండిస్తూ.. విచారణ కమిటీకి జాదవ్ 5 పేజీల సమాధానం ఇచ్చారు. అందులో దిగ్భ్రాంతికర వాస్తవాలు వెలుగుచూశాయి. హత్యానేరానికి జీవితఖైదు అనుభవిస్తున్న అబూసలేం సాగిస్తున్న అరాచకాల పుట్టను అందులో వివరించారు. రాజా ఉత్తలింగం నాడార్ అనే ఖైదీ ఇతడి కోసం దుస్తులు ఉతకడం, అన్నం వడ్డించడం, టీ చేయడం, అతడి సెల్ శుభ్రం చేయడం, గిన్నెలు కడగడం లాంటి పనులన్నీ చేస్తాడని జాదవ్ చెప్పారు. ఇవన్నీ కూడా నిజమేనని నాడార్ కూడా చెప్పాడు. 2010 జూలై వరకు ఆర్థర్ రోడ్డు జైల్లో ఉన్న అబూ సలేంపై.. అప్పట్లో దావూద్ ఇబ్రహీం అనుచరుడైన ముస్తఫా దోసా అనే ఖైదీ దాడి చేశాడు. దాంతో సలేంను తలోజా జైలుకు తరలించారు. అప్పటినుంచి సలేంకు 25 మంది పోలీసులతో భద్రత కల్పించాలని కోర్టు సూచించినా.. సిబ్బంది కొరత కారణంగా జైలు అధికారులు ఆ స్థాయి భద్రత కల్పించలేకపోయారు. దానికి బదులుగా అతడి సెల్లో సీసీటీవీ కెమెరా ఏర్పాటుచేసి, ఇద్దరు పోలీసులను కాపలా పెట్టారు. అయితే, ఇది తన భద్రత కోసం కాదని.. తన మీద నిఘా కోసమే పెట్టారంటూ అబూసలేం ఆరోపించాడు. -
భారత్‌కు డాన్ ఛోటా రాజన్
-
ఛోటా రాజన్ వచ్చేది నేడు ఉదయమే!
నేడు ఉదయం ఢిల్లీకి... బాలి/న్యూఢిల్లీ: మాఫియా డాన్ చోటా రాజన్‌ను సీబీఐ, ఢిల్లీ, ముంబై పోలీసు అధికారులతో కూడిన బృందం భారత్‌కు తీసుకువస్తోంది. రాజన్‌తో ఇండోనేసియాలోని బాలి నుంచి గురువారం(భారత కాలమానం ప్రకారం) రాత్రి 7.45 గంటలకు బయల్దేరిన ప్రత్యేక విమానం శుక్రవారం ఉదయం ఢిల్లీ చేరుకోనుంది. దగ్గర్లోని అగ్ని పర్వతం బద్ధలై, పొగ, బూడిద కమ్ముకోవడంతో బాలి విమానాశ్రయాన్ని మూసేయడంతో రాజన్ తరలింపు ఆలస్యమైంది. పోలీసుల వేట తీవ్రం కావడంతో 1988లో రాజన్ దుబాయి పారిపోయాడు. అక్టోబర్ 25న ఆస్ట్రేలియా నుంచి బాలికి వచ్చిన రాజన్‌ను ఇండోనేసియా పోలీసులు విమానాశ్రయంలోనే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. భారత్‌లో రాజన్‌పై హత్య, స్మగ్లింగ్, బలవంతపు వసూళ్లు తదితర 75కు పైగా కేసులున్నాయి. వాటిలో దాదాపు 70 ముంబైలోనే నమోదై ఉన్నాయి. టాడా, ఉగ్రవాద నిరోధక చట్టం, మోకా తదితర కఠిన చట్టాల కింద ఆయనపై కేసులున్నాయి. కాగా, రాజన్‌పై ఉన్న అన్ని కేసులను సీబీఐకి అప్పగిస్తున్నట్లు గురువారం మహారాష్ట్ర ప్రభుత్వం సంచలన ప్రకటన చేసింది. అంతర్జాతీయ నేరాల విచారణలో సీబీఐకి ఉన్న నైపుణ్యాన్ని, అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర అదనపు ముఖ్య కార్యదర్శి కేపీ బక్షి తెలిపారు. రాజన్‌కు, కేంద్ర భద్రతాసంస్థలకు మధ్య కుదిరిన ఒప్పందం మేరకే మహారాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఆ ఒప్పందంలో భాగంగా.. ముంబైలో తనపై ఉన్న కేసుల విచారణను ముంబై పోలీసుల నుంచి తప్పించాలని, తనను మహారాష్ట్ర జైళ్లో పెట్టకూడదని రాజన్ షరతులు విధించినట్లు తెలిపాయి. అయితే, రాజన్‌ను త్వరలో ముంబైకి తీసుకువస్తామని ముంబై పోలీస్ కమిషనర్ జావేద్ అహ్మద్ స్పష్టం చేయడం విశేషం. రాజన్ హస్తం ఉందని భావిస్తున్న జర్నలిస్ట్ జ్యోతిర్మయి డే హత్యకు సంబంధించిన కేసుకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామన్నారు. తప్పుడు ధ్రువపత్రాలతో ఆస్ట్రేలియాలోని భారతీయ దౌత్య కార్యాలయం నుంచి రాజన్ పొందిన పాస్‌పోర్ట్‌ను భారత్ రద్దు చేసింది. దీనిపై విచారణకు ఆదేశించింది. తప్పుడు ధ్రువపత్రాలతో పాస్‌పోర్ట్ పొందిన ఘటనలు సాధారణమేనని, అయితే, తమ దృష్టికి వచ్చిన వాటిపై చర్యలు తీసుకుంటున్నామని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ పేర్కొన్నారు. ఒకప్పుడు అండర్‌వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీంకు ప్రధాన అనుచరుడైన ఛోటా రాజన్.. 1993 ముంబై పేలుళ్లను వ్యతిరేకించి ‘డీ’ గ్యాంగ్‌కు దూరమయ్యాడు. అనంతరం దావూద్ ఇబ్రహీంకు ప్రధాన శత్రువుగా మారాడు. -
ఛోటా రాజన్ తరలింపు ఆలస్యం?
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకురావడం ఆలస్యమయ్యే అవకాశముంది. ఇండోనేసియా నుంచి మంగళవారం రాత్రి ఛోటా రాజన్‌ను స్వదేశానికి తరలించాలని భారత అధికారులు ప్రయత్నించారు. అయితే బాలి సమీపంలో అగ్ని పర్వతం పేలడంతో ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఛోటా రాజన్ జింబాబ్వేకు పారిపోతుండగా బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చేందుకు ముంబై, ఢిల్లీ పోలీసులతో పాటు సీబీఐ అధికారులు ఇండోనేసియా వెళ్లారు. -
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
-
20 రోజుల్లో భారత్‌కు ఛోటా రాజన్
బాలి: అండర్ వరల్డ్ డాన్ ఛోటా రాజన్‌ను ఇండోనేసియా నుంచి భారత్‌కు తీసుకువచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేశారు. భారత దౌత్యాధికారి సంజీవ్ అగర్వాల్ బాలి జైల్లో ఉన్న ఛోటా రాజన్‌ను కలిశారు. ఛోటా రాజన్‌ను భారత్‌కు తీసుకువచ్చే విషయంపై సంజీవ్ అగర్వాల్.. ఇండోనేసియా అధికారులతో చర్చించారు. 20 రోజుల్లో ఛోటా రాజన్‌ను భారత్‌కు పంపిస్తామని ఇండోనేసియా అధికారులు చెప్పారు. ఛోటా రాజన్‌ను బాలి విమానాశ్రయంలో ఇండోనేసియా పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. -
ఛోటా రాజన్‌ను పట్టించింది నేనే
నేర సామ్రాజ్యాన్ని తనదైన శైలిలో ఏలిన ఛోటా రాజన్ ఇంతకీ ఎలా పట్టుబడ్డాడో తెలుసా.. అతడి బద్ధశత్రువు, మరో మాఫియా నాయకుడు షకీల్ షేక్.. అలియాస్ ఛోటా షకీలే పట్టించాడట. నిజానికి 15 ఏళ్ల క్రితమే ఛోటా రాజన్‌ను బ్యాంకాక్‌లో చంపించేందుకు షకీల్ ప్లాన్ వేశాడు. ఇప్పుడు రాజన్ అరెస్టు తనకేమంత సంతోషంగా అనిపించట్లేదని చెప్పాడు. గత వారంలో కూడా తన మనుషులు ఫిజీలో ఛోటా రాజన్‌ను చంపేందుకు ప్రయత్నించారని, అతడు ఎక్కడెక్కడ దాక్కుంటున్నాడో అన్నీ తమకు తెలుసని ఛోటా షకీల్ చెప్పాడు. తర్వాత అతడు ఇండోనేసియాకు పారిపోతున్న విషయం తెలిసి.. అతడిని అరెస్టు చేయించానన్నాడు. డి కంపెనీ కూడా తమ శత్రువు అరెస్టును జీర్ణించుకోలేకపోతోంది. తమ శత్రుత్వం ఇక్కడితో ముగిసిపోయేది కాదని మాఫియా నాయకులు అంటున్నారు. ఎలాగైనా అతడిని చంపాలనుకుంటున్నానని, అప్పటివరకు విశ్రమించేది లేదని షకీల్ అన్నాడు. అతడిని భారతదేశానికి పంపేసినా కూడా తన ప్రయత్నాలు మాత్రం కొనసాగుతూనే ఉంటాయని తెలిపాడు. తాను భారత ప్రభుత్వాన్ని నమ్మేది లేదని, వాళ్లే ఇన్నాళ్లబట్టి రాజన్‌ను పెంచి పోషించారని, తమమీదకు ఉసిగొల్పారని షకీల్ మండిపడ్డాడు. అసలు భారతదేశంలో అతడి మీద విచారణ జరిగి, శిక్ష పడుతుందన్న నమ్మకం తమకు లేదన్నాడు. శత్రువును ఖతమ్ చేయడమే తమ ఫండా (లక్ష్యం) అని తనదైన శైలిలో షకీల్ చెప్పాడు. అతడు ఎక్కడున్నా క్షమించేది లేదని స్పష్టం చేశాడు. దావూద్ ఇబ్రహీంకు కుడిభుజం లాంటి ఛోటా షకీల్.. ఎప్పటినుంచో రాజన్ కోసం వెతుకుతున్నాడు. 1993 ముంబై వరుస పేలుళ్ల తర్వాత రాజన్.. దావూద్ గ్యాంగ్ నుంచి విడిపోయాడు. 2000 సెప్టెంబర్ నెలలో రాజన్ మీద బ్యాంకాక్‌లో దాడి చేయించింది ఛోటా షకీలే. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన రాజన్.. ఆస్పత్రిపాలయ్యాడు. ఆ తర్వాత తన అనుచరుల సాయంతో ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ రెండు గ్యాంగుల మధ్య దాదాపు రెండు దశాబ్దాల వైరం ఉంది. అటు ఇటు జరిగిన దాడుల్లో రెండు గ్యాంగులకు చెందిన చాలామంది హతమయ్యారు. వాళ్లలో ముందుగా మరణించింది దావూద్‌కు సన్నిహిత అనుచరుడు శరద్ శెట్టి. ఆ తర్వాత బిల్డర్ ఓపీ కుక్రేజా, ఎయిర్‌లైన్స్ సంస్థ ఎండీ టకీయుద్దీన్ వాహిద్, నేపాల్ ఎమ్మెల్యే మీర్జా బేగ్, అక్కడి కేబుల్ ఆపరేటర్ జమీమ్ షా, పర్వేజ్ తండా.. ఇలా ఒకరి తర్వాత ఒకరు నేలకొరిగారు. ఆ తర్వాత ముంబై పేలుళ్లకు కుట్రపన్నిన వాళ్లు ఒక్కొక్కరిని రాజన్ చంపడం మొదలుపెట్టాడు. సలీమ్ కుర్లా, మజీద్ ఖాన్, మహ్మద్ జింద్రన్.. ఇలాంటి వాళ్లు ఛోటా రాజన్ గ్యాంగు చేతిలో నేలరాలారు.