కంతనపల్లిలో బొగ్గు నిల్వలు!
{పాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిక్షేపాలు
వాప్కోస్ సర్వేలో వెల్లడి !
సాగునీటి ప్రాజెక్టుపై సర్కారు పునఃపరిశీలన
వరంగల్: తెలంగాణలో కీలకమైన పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బహుళార్థక ప్రాజెక్టు కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ జిల్లా ఏటూరునాగా రం మండలం కంతనపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మట్టి పరీక్షల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన స్థలం లో భూమి స్థితిగతులను తెలుసుకునేందుకు ఏడాదిగా డ్రిల్లింగ్‌తో భూ సార పరీక్షలు నిర్వహించారు. 45 మీటర్ల లోతుల్లోని భూమిలో బొగ్గు తునకలు, ముక్కలు బయటకు రావడంతో సర్వే నిర్వహిస్తున్న సంస్థ, సాగునీటి శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. సాంకేతింగా బొగ్గు ఉన్నస్థలంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడానికి వీలు కాదు. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వాప్కోస్ కన్సల్టెన్సీ కంపెనీ సర్వేలో వెల్లడైంది.
అధికారులు మాత్రం ఈ విషయా న్ని ధ్రువీకరించడంలేదు. శ్రీరాంసాగర్, దేవాదుల ప్రాజెక్టుల ఫలాలు తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గమని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి లో ఈ ప్రాజెక్టును సందర్శిం చారు. ఇక్కడే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం వేగం గా ఏర్పాట్లు చేస్తోంది. తాజా బడ్జెట్‌లో కంతనపల్లి నిర్మాణానికి ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు బొగ్గు నిక్షేపాల విషయంతో పరిస్థితిలో మార్పు వస్తోంది.