kantanapalli
-
కంతనపల్లి, ప్రాణహిత సంగతేంటో!
⇒ పర్యావరణ, అటవీ సమస్యల నుంచి గట్టేక్కేనా.. ⇒ మార్చిలో ఏఈసీ కమిటీ ముందు ప్రజెంటేషన్ సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకం కింద పర్యావరణ ప్రభావ మదింపు (ఈఐఏ)కు కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వ శాఖ బ్రేకులు వేసిన నేపథ్యంలో.. ఇదే అంశంతో ముడిపడి ఉన్న ఇతర ప్రాజెక్టులపై కేంద్రం ఎలా వ్యవహరిస్తుం దన్నది ప్రస్తుతం పెద్ద ప్రశ్నగా మారింది. ప్రాణహిత, కంతనపల్లి ప్రాజెక్టుల పర్యా వరణ అంశాలపై కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ(ఈఏసీ) ఏ విధమైన నిర్ణయం తీసుకుంటుందన్న దానిపై ఆందోళన నెలకొంది. కాళేశ్వరం మాదిరే వ్యవహరిస్తే ఏమిటన్నది రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్‌గా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టులో మాదిరే ప్రాణహిత, కంతనపల్లి లోనూ భారీగా భూసేకరణ, అటవీ భూమి అవసరాలున్నాయి. ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలో 3,900 ఎకరాల భూసేకరణ అవస రం కానుండగా, 2,671.32 ఎకరాల అటవీ భూమి అవసరం ఉంది. ఇక కంతనపల్లి పరిధిలోనూ 90 ఎకరాల అటవీ భూమి అవసరంతో పాటు 1500 ఎకరాల భూమి ముంపునకు గురౌతోంది. వీటన్నింటికీ సం బంధించి కేంద్ర పర్యావరణ శాఖ ముందు ప్రజెంటేషన్ చేస్తేనే టెర్మ్స్ ఆఫ్ రిఫరెన్స్ (టీఓఆర్)ను ఖరారు చేస్తుంది. ఈ టీఓఆర్‌కు అనుగుణంగా పర్యావరణ మదింపు నివేది కను తిరిగి మంత్రిత్వ శాఖకు సమర్పిస్తే అక్కడ ఆమోదం దక్కనుంది. ఈ టీఓఆర్ ప్రక్రియను మూడు దఫాలుగా చేయాల్సి ఉంటుంది. ఒకటి వర్షా కాలానికి ముందు, వర్షాకాలం, వర్షా కాలం ముగిసిన అనంతరం వేర్వేరు పరిస్థితుల్లో పర్యావరణ మదింపు చేసి సమర్పించాల్సి ఉంటుంది. ఒకవేళ కేంద్రం టీఓఆర్‌కు ఓకే చేస్తే మూడు సీజన్ల అధ్యయన వివరాలతో నీటి పారుదల శాఖ నివేదిస్తుంది. ఒకవేళ కేంద్ర జల సంఘం కొత్తగా తెచ్చిన మార్గదర్శకాలను సాకుగా చూపి టీఓఆర్‌కు అనుమతి ఇవ్వని పక్షంలో మళ్లీ కొత్తగా ప్రక్రియ మొదలు పెట్టాల్సి ఉంటుంది. ఇప్పటికే పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నారంటూ కొం దరు వ్యక్తులు గ్రీన్ ట్రిబ్యునళ్లకు వెళుతున్న నేపథ్యంలో ప్రస్తుత పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ నేపథ్యంలో మార్చి 2న ప్రాణహితపై, మార్చి 3న కంతనపల్లి పర్యావరణ మదింపు ప్రక్రియపై ఈఏసీ భేటీలు నిర్వహిస్తోంది. ప్రాణహిత అటవీ భూమికి వైల్డ్ లైఫ్ బోర్డు ఓకే కాగా ప్రాణహిత ప్రాజెక్టు పరిధిలోకి వచ్చే 622.0126 హెక్టార్ల అటవీ భూమిని నీటి పారుదల శాఖ పరిధిలోని మార్చేందుకు రాష్ట్ర వైల్డ్‌లైఫ్ బోర్డు సోమవారం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిజానికి ప్రాజెక్టు కోసం కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ అటవీ డివిజన్ల పరిధిలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ ప్రాంతం, మహారాష్ట్రలోని తడోబా అంధారి టైగర్ రిజర్వ్ ప్రాంతం, చత్తీస్‌గఢ్‌లోని ఇంద్రా వతి టైగర్ రిజర్వ్ ప్రాంతంలో కలిపి మొత్తంగా 1081.0478 హెక్టార్ల అటవీ భూమి ఈ ప్రాజెక్టుకు అవసరం కానుంది. కాగా ఇందులో 622.0126 హెక్టార్ల అటవీ భూమిని బదలా యించేందుకు స్టేట్ బోర్డు ఓకే చేసింది. అయితే మంచిర్యాల జిల్లా జైపూర్ మండల శివరాంలో నిర్మించ తలపెట్టిన ఎత్తిపోతల పథకం, ఇదే జిల్లా చెన్నూరు పరిధిలోని సోమన్ పల్లి ఎత్తిపోతల పథకాలకు అటవీ భూమి బదలాయింపులను తిరస్కరించింది. -
కంతనపల్లి కధ కంచికే..
తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మాణం అంచనా విలువ రూ.2,200 కోట్లు {పభుత్వానికి డీపీఆర్ సమర్పణ రుత్విక్-స్యూ కంపెనీలకే నిర్మాణ పనులు పూర్తయితేనే దేవాదుల ఆయకట్టుకు భరోసా వరంగల్ : గోదావరి నదిపై ఏటూరునాగారం మండలంలోని కంతనపల్లి వద్ద నిర్మించ తలపెట్టిన పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి ప్రాజెక్టు కథ కంచికి చేరింది. ఈ ప్రాజెక్టు స్థానంలో తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించేందుకు వ్యాప్కోస్ సర్వే సంస్థ రూపొందించిన డీపీఆర్ (డిటేల్డ్ ప్రాజెక్టు రిపోర్టు)ను ఇరిగేషన్ అధికారులు ప్రభుత్వానికి సమర్పించారు. ఈ బ్యారేజీ నిర్మాణానికి రూ.2200 కోట్ల్లు అవుతుందని అంచనాలు రూపొందించారు. ప్రభుత్వం గోదావరి నదిపై వరుస బ్యారేజీలు నిర్మించేందుకు ఉత్సాహం చూపుతున్నందున దీనికి నెలరోజుల్లో పరిపాలన మంజూరు వస్తుందని అధికారులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కంతనపల్లి ప్రాజెక్టు నిలిపివేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో సుమారు 10వేల ఎకరాలు ముంపునకు గురికావడమే కాకుండా పక్క రాష్ట్రాలతో సమస్యలు తలెత్తనున్నాయి. దీనికి తోడుగా ఆటవీ గ్రామాలు ముంపునకు గురికావడంపై ఆదివాసీ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాయి. ఈ విషయాలను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు.. అటవీ భూముల ముంపు లేకుండా, అంతరాష్ట్ర సమస్యలు తలెత్తకుండా ఉండే విధంగా ప్రాజెక్టులకు రీడిజైన్ చేయించారు. ఈ నేపథ్యంలో ప్రాజెక్టుల స్థానంలో గోదావరిపై వరుస బ్యారేజీలను నిర్మించాలని సాగునీటి శాఖకు ఆదేశాలు ఇచ్చారు. ఈ వరస బ్యారేజీల నిర్మాణ ప్రాంతాలు, నీటి లభ్యత, భూముల ముంపు తదితర అంశాలపై సాగునీటి ప్రాజెక్టులపై సర్వే నిర్వహించే సంస్థ తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణంపై పూర్తి డీపీఆర్‌ను రూపొందించింది. ఈడీపీఆర్ను పరిశీలించిన సాగునీటి శాఖ ఉన్నతాధికారులు కొన్ని చిన్న మార్పులు చేసి ప్రభుత్వానికి సమర్పించారు. బ్యారేజీ నిర్మాణానికి రూ.2200కోట్లు తుపాకులగూడెం వద్ద బ్యారేజీని 80-88 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు రూ.2340 కోట్ల వ్యయం అవతుందని అంచనాలు రూపొందించారు. ఈ బ్యారేజీ డీపీఆర్‌ను పరిశీలించిన నిపుణుల కమిటీ.. 83 మీటర్ల ఎత్తుతో నిర్మిస్తే చత్తీస్‌గఢ్‌తో పాటు మన ప్రాంతాల్లో ఏ ఒక్క గ్రామం కూడా ముంపునకు గురికాదని నిర్ధారించారు. ఈ ఎత్తుతో నిర్మిస్తే దేవాదుల ఎత్తిపోతల పథకం ఇంటేక్వెల్ వద్ద నీరు 73మీటర్ల ఎత్తుతో ప్రవహిస్తుందని వ్యాప్కోస్ సంస్థ రిపోర్టులో పేర్కొంది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సరిహద్దుకు ఆరు కిలోమీటర్ల దిగువ ఈ బ్యారేజీ నిర్మిస్తున్నందున ఇరుపక్కలా తెలంగాణ రాష్ట్రం పరిధి కావడం కలిసివచ్చే అంశం. 83 మీటర్ల ఎత్తుతో రూ.2200 కోట్ల వ్యయంతో బ్యారేజీని నిర్మించనున్నారు. బ్యారేజీ నుంచి దేవాదుల ఇన్‌టేక్ వెల్ వరకు సుమారు 6.90 టీఎంసీల నీరు ఎల్లప్పుడూ నిల్వ ఉంటుంది. నిత్యం ప్రవహిస్తున్న నీటిని ప్రతిరోజూ 2600క్యూసెక్కులను ఏడాది పాటు దేవాదుల ఎత్తిపోతల పథకం ద్వారా ఎత్తిపోసే అవకాశాలు ఉన్నట్లు అధికారులు తె లిపారు. కంతనపల్లి ఏజెన్సీకే బ్యారేజీ పనులు కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం నిలిపివేస్తున్నందున దాని స్థానంలో నిర్మించ తలపెట్టిన తుపాకులగూడెం బ్యారేజీ నిర్మాణ పనులను పాత కాంట్రాక్టర్‌కే అప్పగించేందుకు ప్రభుత్వం సూత్రప్రాయంగా అంగీకారం తెలిపింది. కంతనపల్లి పనులను రుత్విక్-స్యూ కంపెనీలు జాయింట్ వెంచర్‌గా దక్కించుకున్నాయి. అన్ని అనుమతులు రావడంతో ప్రాజెక్టు నిర్మాణంలో ఉపయోగించే పరికరాలను, సామగ్రిని సైట్లోకి తరలించింది. ఇప్పుడు అర్ధాంతరంగా ప్రాజెక్టు పనులు నిలిపివేసినందున కాంట్రాక్టర్‌కు పెద్దఎత్తున నష్ట పరిహారం చెల్లించాల్సిన పరిస్థితి ప్రభుత్వానికి ఏర్పడింది. బ్యారేజీ పనులను తమకు అప్పగిస్తే నిర్మిస్తామని రుత్విక్-స్యూ కంపెనీలు ముందుకు రావడంతో ప్రభుత్వం అంగీకారం తెలిపినట్లు తెలిసింది. తాత్కాలిక అనుమతులతో నిర్మాణం ప్రారంభం తుపాకులగూడెం వద్ద బ్యారేజీ నిర్మించేందుకు ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇస్తే వెంటనే పనులు ప్రారంభించేందుకు ఇరిగేషన్ అధికారులు సమాయత్తమవుతున్నారు. ఈ బ్యారేజీ నిర్మాణంలో అంతరాష్ట్ర ఇబ్బందులు, అటవీ ప్రాంతం, నివాస స్థలాలు, సాగుభూములు, గ్రామాలు ముంపునకు గురికాకపోవడం, పర్యావరణ ఇబ్బందులు లేక పోవడం వల్ల తాత్కాలికంగా కేంద్రం నుంచి నిర్మాణ అనుమతి పొందేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు నిర్మాణానికి నిధుల కేటాయింపుతో పరిపాలన అనుమతి ఇస్తే ఈ వేసవి కాలంలోనే పనులు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. -
కంతనపల్లిలో బొగ్గు నిల్వలు!
{పాజెక్టు ప్రతిపాదిత స్థలంలో నిక్షేపాలు వాప్కోస్ సర్వేలో వెల్లడి ! సాగునీటి ప్రాజెక్టుపై సర్కారు పునఃపరిశీలన వరంగల్: తెలంగాణలో కీలకమైన పి.వి.నర్సింహారావు కంతనపల్లి సుజల స్రవంతి బహుళార్థక ప్రాజెక్టు కొత్త మలుపు తిరుగుతోంది. వరంగల్ జిల్లా ఏటూరునాగా రం మండలం కంతనపల్లి గ్రామ సమీపంలో గోదావరి నదిపై ప్రాజెక్టు ప్రతిపాదిత స్థలంలో బొగ్గు నిక్షేపాల ఆనవాళ్లు ఉన్నట్లు నివేదికలు వచ్చినట్లు తెలుస్తోంది. మట్టి పరీక్షల్లో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు తేలింది. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణం కోసం కేటాయించిన స్థలం లో భూమి స్థితిగతులను తెలుసుకునేందుకు ఏడాదిగా డ్రిల్లింగ్‌తో భూ సార పరీక్షలు నిర్వహించారు. 45 మీటర్ల లోతుల్లోని భూమిలో బొగ్గు తునకలు, ముక్కలు బయటకు రావడంతో సర్వే నిర్వహిస్తున్న సంస్థ, సాగునీటి శాఖ అధికారులు ఆశ్చర్యపోయారు. సాంకేతింగా బొగ్గు ఉన్నస్థలంలో ప్రాజెక్టు నిర్మాణాలు చేపట్టడానికి వీలు కాదు. కంతనపల్లి ప్రాజెక్టు నిర్మాణ స్థలంలో బొగ్గు నిక్షేపాలు ఉన్నట్లు వాప్కోస్ కన్సల్టెన్సీ కంపెనీ సర్వేలో వెల్లడైంది. అధికారులు మాత్రం ఈ విషయా న్ని ధ్రువీకరించడంలేదు. శ్రీరాంసాగర్, దేవాదుల ప్రాజెక్టుల ఫలాలు తెలంగాణ ప్రజలకు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గమని సాగునీటి శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయాలనే ఉద్దేశంతో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటోంది. సీఎం కేసీఆర్ ఈ ఏడాది మార్చి లో ఈ ప్రాజెక్టును సందర్శిం చారు. ఇక్కడే జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కంతనపల్లి బ్యారేజీ నిర్మాణం కోసం ప్రభుత్వం వేగం గా ఏర్పాట్లు చేస్తోంది. తాజా బడ్జెట్లో కంతనపల్లి నిర్మాణానికి ప్రభుత్వం రూ.125 కోట్లను విడుదల చేసింది. ఇప్పుడు బొగ్గు నిక్షేపాల విషయంతో పరిస్థితిలో మార్పు వస్తోంది. -
నేడు జిల్లాకు సీఎం కేసీఆర్
నేడు జిల్లాకు సీఎంకేసీఆర్ రేపు ‘కంతనపల్లి, దేవాదుల’ ఏరియల్ సర్వే శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు కరీంనగర్‌ను దాటి వరంగల్ జిల్లాకు రావడం ఇబ్బందిగానే ఉంది. సాంకేతిక లోపాలతో దేవాదులను సామర్థ్యం మేరకు ఉపయోగించుకునే పరిస్థితి లేదు. ఈ రెండు ప్రాజెక్టుల ఫలాలు పూర్తిస్థాయిలో అందాలంటే కంతనపల్లి ఒక్కటే మార్గం. అలాంటి బృహత్తర ప్రాజెక్ట్ నిర్మాణానికి అవాంతరాలు ఎదురవుతూనే ఉన్నారుు. సీఎం కేసీఆర్ ఆదివారం కంతనపల్లి, దేవాదుల ప్రాజెక్ట్‌పై ఏరియల్ సర్వే చేస్తుండడంతో జిల్లావాసుల్లో ఆశలు చిగురిస్తున్నారుు. కంతన పల్లిపై కదలిక తెస్తారని.. దేవాదుల, ఎస్సారెస్పీ దిశాదశ మారుస్తారని.. తాగు, సాగు నీటి అవసరాలు తీరుస్తారని ప్రజలు కోటి ఆశలతో ఎదురు చూస్తున్నారు. సాక్షి ప్రతినిధి, వరంగల్ వరంగల్: గోదావరి నదిపై నిర్మించ తలపెట్టిన దేవాదుల(జువ్వాడి చొక్కారావు గోదావరి ఎత్తిపోతల పథకం) నిర్మాణం ప్రారంభించి పుష్కరం దాటినా ఎన్నటికి పూర్తయ్యేనో తేలియడం లేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాకతోనైనా ప్రాజెక్టు త్వరగా పూర్తవుతుందనేది జిల్లావాసుల ఆశ. వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లోని 30 మండలాల్లో 6.21 లక్షల ఎకరాలకు 38.18 టీఎంసీల నీరందించేందుకు 1999లోనే కేంద్ర జల వనరుల సంఘం సభ్యుడు విద్యాసాగర్‌రావు ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. దట్టమైన అటవీ ప్రాంతంలో నిర్మాణం చేయలేమంటూ ఏళ్లపాటు పట్టించుకోని అప్పటి చంద్రబాబు ప్రభుత్వం... చివరకు 2003లో ఫైల్‌ను బయటకు తీసింది. బాబు 2003 జూన్‌లో ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు. కానీ ఒక్క రూపాయి నిధులివ్వలేదు. నిధుల్లేక భూ సేకరణ ఆగింది. భారీ నీటి పారుదల శాఖ మంత్రిగా కడియం శ్రీహరి ఉన్నప్పుడే రూ.783 కోట్లతో టెండర్లు పూర్తరుునా నిధులు విడుదల కాలేదు. రూ.930 కోట్లతో దేవాదుల ఫేజ్-1 ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతులు వచ్చాయి. టెండర్లు పిలిచే సమయానికి రూ.783 కోట్లకు తగ్గించారు. ఈ ధరకే చంద్రకు సన్నిహితంగా ఉండే ఓ సంస్థకు టెండర్లు అప్పగించారు. 2004 జనవరిలో పనులు చేసేందుకు కంపెనీ.. అగ్రిమెంట్ చేసుకుంది. తర్వాత తొలిసారిగా దేవాదుల ప్రాజెక్టుకు రూ.93.50 కోట్లు మాత్ర మే విడుదల చేశారు. తొలి విడతలో 5.18 టీఎంసీల నీటిని పంపింగ్ చేసేందుకు రూ.930 కోట్లతో నిర్మాణ పనులు చేపట్టాలని ప్రభుత్వం 2006 జులై 7న సాంకేతిక అనుమతి మంజూ రు ఇస్తూ టెండర్లు పిలిచింది. ప్రాజెక్టుతో మొత్తం 1.24 లక్షల ఎకరాల బీడుభూమిని సాగులోకి తీసుకురానున్నారు. గంగారం ఇంటెక్ వెల్ నుంచి భీంఘన్‌పూర్, అక్కడ నుంచి పులుకుర్తి, ధర్మసాగర్ రిజర్వాయరు నిర్మాణం చేపట్టనున్నట్లు తొలివిడతలో రూపొందించారు. మొదటి, రెండో విడతల్లో పనులలో ధర్మసాగర్ వరకు పూర్తయినా నిర్దేశించినా ఆయకట్టుకు నీరివ్వలేకపోతున్నారు. వైఎస్సార్ రాకతో... 2004 ఎన్నికల తర్వాత ముఖ్యమంత్రి పదవి చేపట్టిన వైఎస్ రాజశేఖరరెడ్డి జలయజ్ఞంలో దేవాదుల ప్రాజెక్టుకు ప్రాధాన్యత ఇచ్చారు. అప్పటి యూపీఏ చైర్ పర్సన్ సోనియాగాంధీతో ప్రాజెక్టు పనులకు శంకుస్థాపన చేయించారు. 1.24 లక్షల ఎకరాల ఆయకట్టుకు మరో 844 ఎకరాల ఆయకట్టును పెంచారు. దీంతో మొదటి విడతకు రూ.1319.38 కోట్లు కేటాయించారు. అప్పటి నుంచి దేవాదుల మొదటి, రెండో దశ పనులు ముందుకు సాగాయి. తొలిదశలో సుమారు 40 వేల ఎకరాలకు సాగునీరందుతోంది. దేవాదుల ఎత్తిపోతల పథకంలో మొదటి, రెండు దశలు పైపుల ద్వారా నీటిని పంపింగ్ చేస్తుండగా మూడో దశలో సొరంగం ద్వారా నీటిని ఎత్తిపోసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 58 కిలోమీటర్ల పైపులైను నిర్మాణం కోసం 2005లో రూ.945కోట్లు మంజూరయ్యాయి. 2008లో టెండర్లు నిర్వహించగా ఈ పనులను కోస్టల్ కంపెనీ దక్కించుకుంది. పనులు జరుగుతుండగా శాయంపేట మండలం వసంతపూర్ వద్ద బుంగ ఏర్పడడంతో సొరంగంలో నీరు చేరి ముగ్గురు కార్మికులు జలసమాధి అయ్యారు. అప్పటి నుంని పనులు నిలిచిపోయాయి. దీనికి తోడు టన్నెల్ నిర్మాణంలో పేల్చివేతల వల్ల రామప్ప ఆలయానికి ప్రమాదం ఏర్పడుతుందని పురావస్తు శాఖ అభ్యంతరం చెప్పడంతో సొరంగం అలైన్మెంట్ మార్చాల్సి వచ్చింది. ఇప్పటి వరకు ఈ అలైన్మెంట్లు మూడుసార్లు మార్చారు. మూడో సారి అలైన్మెంటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.