కేజ్రీవాల్ ఇంటి ముందు ధర్నా
న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసం ఎదుట బుధవారం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ధర్నాకు దిగారు. ఆప్ సర్కారు ఆమోదించిన వ్యాట్ బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళన చేపట్టారు. ఉత్తర ఢిల్లీ సివిల్ లైన్స్ లోని కేజ్రీవాల్ నివాసం ఎదుట ఈ మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో కాంగ్రెస్ కార్యకర్తలు ధర్నా చేశారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వ్యాట్ బిల్లు(రెండో సవరణ)ను కేజ్రీవాల్ ప్రభుత్వం మంగళవారం ఆమోదించింది. దీని ప్రకారం ప్రభుత్వం 12.5 నుంచి 30 శాతం వ్యాట్ విధించనుంది.