యూపీలోని బదయూ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బరేలి రైల్వేస్టేషన్ వద్ద అతడిని పట్టుకున్నారు. రెండో కానిస్టేబుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు. యూపీలోని బదయూ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ 14 ఏళ్ల బాలికపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. దాంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే.
డిసెంబర్ 31వ తేదీన ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో వీర్ పాల్ సింగ్ యాదవ్, అవినాష్ యాదవ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను లాక్కెళ్లి మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడే సామూహిక అత్యాచారం చేశారు. దాంతో వాళ్లిద్దరినీ ఇప్పుడు విధుల నుంచి కూడా తొలగించినట్లు నగర ఎస్పీ లల్లన్ సింగ్ తెలిపారు.
గ్యాంగ్ రేప్ కేసులో కానిస్టేబుల్ అరెస్టు
Published Tue, Jan 6 2015 5:40 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM
Advertisement
Advertisement