Badaun rape
-
గ్యాంగ్ రేప్ కేసులో కానిస్టేబుల్ అరెస్టు
యూపీలోని బదయూ ప్రాంతంలో బాలికపై సామూహిక అత్యాచారం చేసి, పరారీలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లలో ఒకరిని పోలీసులు అరెస్టు చేశారు. బరేలి రైల్వేస్టేషన్ వద్ద అతడిని పట్టుకున్నారు. రెండో కానిస్టేబుల్ మాత్రం ఇంకా పరారీలోనే ఉన్నాడు. అతడిని పట్టుకోడానికి యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందాన్ని రంగంలోకి దించారు. యూపీలోని బదయూ పోలీసుస్టేషన్ పరిధిలో ఓ 14 ఏళ్ల బాలికపై ఇద్దరు కానిస్టేబుళ్లు అత్యాచారం చేశారు. దాంతో వారిని విధుల నుంచి సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. డిసెంబర్ 31వ తేదీన ఆ బాలిక ఇంటి నుంచి బయటకు వచ్చిన సమయంలో వీర్ పాల్ సింగ్ యాదవ్, అవినాష్ యాదవ్ అనే ఇద్దరు కానిస్టేబుళ్లు ఆమెను లాక్కెళ్లి మూసాజాగ్ పోలీసు స్టేషన్లోకి తీసుకెళ్లి అక్కడే సామూహిక అత్యాచారం చేశారు. దాంతో వాళ్లిద్దరినీ ఇప్పుడు విధుల నుంచి కూడా తొలగించినట్లు నగర ఎస్పీ లల్లన్ సింగ్ తెలిపారు. -
సర్కారును డిస్మిస్ చేసి పారేయండి!
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో మహిళలకు ఏమాత్రం భద్రత లేకుండా పోయిందన్న అంశం రాజ్యసభలో పెను దుమారాన్ని రేకెత్తించింది. అక్కడి అఖిలేష్ యాదవ్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి పారేయాలని బహుజన సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతి సహా పలువురు గట్టిగా డిమాండ్ చేశారు. ఇది సమాజ్ వాదీ, బీఎస్పీ సభ్యుల మధ్య వాగ్వాదానికి దారితీసింది. రాజ్యసభలో 14 మంది సభ్యులున్న బీఎస్పీ.. బదయూలో ఇద్దరు అక్కా చెల్లెళ్లపై అత్యాచారం, హత్య సంఘటన విషయమై మంగళవారం నాటి సభలో ఒక్కసారిగా మండిపడింది. సభా కార్యకలాపాలు ప్రారంభం కాగానే పార్టీ అధినేత్రి మాయావతి ఎదురుదాడి ప్రారంభించారు. బదయూ లోక్సభ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి సమీప బంధువు ధర్మేంద్ర యాదవ్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. యూపీలో శాంతి భద్రతల పరిస్థితి ఘోరంగా ఉందని, కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుని యూపీలో వెంటనే రాష్ట్రపతి పాలన విధించాలని, అఖిలేష్ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయాలని మాయావతి డిమాండ్ చేశారు. సీబీఐతో విచారణ జరిపించాలన్న తన హామీని కూడా ముఖ్యమంత్రి మర్చిపోయారని ఎద్దేవా చేశారు. ఆ సమయంలో బీఎస్పీ సభ్యులు వెల్లోకి దూసుకెళ్లి యూపీ సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సమాజ్వాదీ సభ్యులు కూడా వారితోపాటు వెల్లోకి వెళ్లడంతో ఛైర్మన్ అన్సారీ సభను పది నిమిషాల పాటు వాయిదావేశారు. తిరిగి సమావేశమయ్యాక బీఎస్పీ ఎంపీలు వాకౌట్ చేయడంతో సభ సజావుగా సాగింది. -
'అఖిలేష్ ప్రభుత్వాన్ని రద్దు చేయండి'
ఉత్తరప్రదేశ్లోని శాంతి భద్రతలు మృగ్యమైనాయిని బీఎస్పీ అధినేత్రి మాయావతి ఆరోపించారు. ఈ నేపథ్యంలో సమాజ్ వాదీ ప్రభుత్వాన్ని రద్దు చేయాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కేంద్రం జోక్యం చేసుకుని రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం రాజ్యసభలో ఆ అంశంపై చర్చకు మాయావతి పట్టుపట్టారు. ఆ అంశంపై చర్చకు రాజ్యసభ చైర్మన్ అనుమతి నిరాకరించారు. ఈ నేపథ్యంలో రాజ్యసభ వెల్లోకి దూసుకెళ్లిన మాయావతితోపాటు ఆ పార్టీ పార్లమెంట్ సభ్యులు యూపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అదే సమయంలో సమాజ్ వాదీ పార్టీకి చెందిన ఇద్దరు ఎంపీలు రాజ్యసభ వెల్లోకి దూసుకువచ్చి అఖిలేష్ ప్రభుత్వానికి అనుకూలంగా నినాదాలు చేశారు. దాంతో రాజ్యసభలో కొద్దిపాటి గందరగోళం నెలకొంది. దీంతో రాజ్యసభను 10 నిముషాలు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఆగ్రహించిన బీఎస్పీ అధినేత్రి మాయావతి తాము వాకౌట్ చేస్తున్నట్లు ప్రకటించారు. యూపీలో ఇటీవల వరుస సామూహిక అత్యాచారాలు, బీజేపీ నాయకుడు హత్య నేపథ్యంలో యూపీలో శాంతి భద్రతలు అడుగంటాయని ఆమె ఆరోపించారు.