
'పారిశ్రామీకరణకు వ్యతిరేకం కాదు'
భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశవ్యాప్త నిరసన చేపట్టనున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు.
విజయవాడ: భూసేకరణ బిల్లుకు వ్యతిరేకంగా మే 14న దేశవ్యాప్త నిరసన చేపట్టనున్నామని సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి తెలిపారు. పారిశ్రామీకరణకు తమ వామపక్ష పార్టీలు వ్యతిరేకం కాదని చెప్పారు. కార్పొరేట్ వర్గాలకు మేలు చేసేలా కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను అడ్డుకుంటామన్నారు.
సాగుకు పనికిరాని భూములు, సర్కారీ స్థలాలు పరిశ్రమలకు కేటాయించాలని సూచించారు. సాగు భూములు బలవంతంగా లాక్కుకోవడం మంచిది కాదన్నారు. రైతు సమస్యలను పరిష్కరించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైందని సుధాకరరెడ్డి విమర్శించారు. అన్నదాతలకు మద్దతు కల్పించలేకపోయిందని ధ్వజమెత్తారు.