పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్ | Delhi: Rajnath Singh leaves for Pakistan | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్

Published Wed, Aug 3 2016 5:09 PM | Last Updated on Mon, Sep 4 2017 7:40 AM

పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్

పాకిస్తాన్ పర్యటనకు రాజ్ నాథ్

ఢిల్లీ: కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఉగ్రవాదుల హెచ్చరికలు, నిరసనలను బేఖాతరు చేస్తూ పాకిస్తాన్ పర్యటనకు వెళ్లారు. బుధవారం సాయంత్రం ఇస్లామాబాద్ చేరుకున్నారు. పాకిస్తాన్లో జరిగే సార్క్ సమావేశాల్లో రాజ్నాథ్ పాల్గొంటారు. ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ సాయం, భారత నకిలీ కరెన్సీ నియంత్రణ తదితర విషయాలను ఈ సదస్సులో లేవనెత్తనున్నారు.

కాగా రాజ్ నాథ్ పాక్ పర్యటనను ఉగ్రవాద సంస్థలు హిజ్బుల్ ముజాహిద్దీన్, లష్కరే తోయిబా తీవ్రంగా వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. పాక్లో రాజ్నాథ్ పర్యటిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించాయి. రాజ్ నాథ్ పర్యటనను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు చేపడుతామని జమాత్-ఉద్-దావా చిఫ్ హఫీజ్ సయీద్ హెచ్చరించాడు. ఈ నేపథ్యంలో రాజనాథ్ పర్యటన టెన్షన్గా మారింది. కాగా రాజ్‌నాథ్‌కు  భద్రత కల్పించాల్సిన బాధ్యత పాక్ ప్రభుత్వానిదేనని హోంశాఖ సహాయమంత్రి కిరణ్ రిజిజు ఇటీవల రాజ్యసభలో చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement