ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు! | Rajnath Skips Lunch Hosted by Pak Counterpart | Sakshi
Sakshi News home page

ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు!

Published Thu, Aug 4 2016 6:19 PM | Last Updated on Mon, Sep 4 2017 7:50 AM

ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు!

ఆ విందులో పాల్గొనకుండానే భారత్‌కు!

ఇస్లామాబాద్‌: పాకిస్థాన్‌ హోంమంత్రి చౌదరి నిస్సార్‌ ఆలీఖాన్‌ ఏర్పాటుచేసిన  విందులో పాల్గొనకుండానే కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ భారత్‌ తిరిగి వచ్చారు. ఇస్లామాబాద్‌లో గురువారం జరిగిన 7వ సార్క్‌ హోంమంత్రుల సమావేశంలో పాల్గొన్న రాజ్‌నాథ్‌.. ఈ విందుకు హాజరుకాలేదు. సార్క్‌ సదస్సులో పాల్గొంటున్న విదేశీ అతిథుల గౌరవార్థం నిస్సార్‌ ఆలీఖాన్‌ ఈ విందును ఏర్పాటుచేశారు. అయితే, ఆయనే స్వయంగా ఈ విందులో పాల్గొనకుండా.. సార్క్‌ సమావేశం ముగిసిన వెంటనే వెళ్లిపోయారు. ఆతిధ్యం ఇస్తున్న వ్యక్తే లేకపోవడంతో రాజ్‌నాథ్‌ ఈ విందులో పాల్గొనరాదని నిర్ణయించారు.

అనంతరం నేరుగా హోటల్‌కు వెళ్లి అక్కడ భారతీయ ప్రతినిధులతో కలిసి రాజ్‌నాథ్ భోజనం చేశారు. అనంతరం నేరుగా ఇస్లామాబాద్‌ నుంచి ఢిల్లీ బయలుదేరారు. సార్క్‌ సమావేశంలో రాజ్‌నాథ్‌ ప్రసంగం ప్రసారం చేయకుండా పాక్‌ దుందుడుకుగా వ్యవహరించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, భారత్‌ మాత్రం ఇస్లామాబాద్‌లో రాజ్‌నాథ్‌ ప్రసంగం ప్రసారం కాకుండా అడ్డుకున్నారని వచ్చిన కథనాలను తోసిపుచ్చింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement