కార్ల దిగ్గజాలకు ట్రంప్ వార్నింగ్
కార్ల దిగ్గజాలకు ట్రంప్ వార్నింగ్
Published Mon, Jan 16 2017 8:16 PM | Last Updated on Sat, Aug 25 2018 7:50 PM
ఫ్రాంక్ఫర్ట్ : జర్మన్ ప్రముఖ కార్ల దిగ్గజాలు బీఎండబ్ల్యూ, డైమ్లెర్, ఫోక్స్వాగన్లకు అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పన్ను హెచ్చరికలు జారీచేశారు. అమెరికా మార్కెట్కు దిగుమతి చేసే వాహనాలపై 35 శాతం సరిహద్దు పన్ను చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ట్రంప్ వార్నింగ్స్ను పబ్లిష్ చేసిన జర్మన్ న్యూస్పేపర్ రిపోర్టుతో ఆ కంపెనీల షేర్లు ఒక్కసారిగా ఢమాల్ మన్నాయి. అమెరికాలో కంటే మెక్సికోలో ఉత్పత్తి ఖర్చులు తక్కువున్న నేపథ్యంలో ఈ మూడు కంపెనీలు మెక్సికో ఫ్యాక్టరీల్లో భారీగా పెట్టుబడులు పెట్టాయి. ఈ పెట్టుబడులతో చిన్న వాహనాలను అమెరికా మార్కెట్కు ఎగుమతి చేయాలని ప్లాన్ చేశాయి.
అయితే అమెరికాలో కార్ల ఉత్పత్తిని తగ్గించడంపై మండిపడ్డ ట్రంప్, జర్మన్ కార్ల కంపెనీలపై విమర్శలు ప్రారంభించినట్టు జర్మన్కు చెందిన న్యూస్ పేపర్ పబ్లిష్ చేసింది. 'ప్రపంచంలో కార్లను ఉత్పత్తి చేయాలని మీరు కోరుకుంటున్నారా.. అయితే మీకు ఆల్ ది బెస్ట్. అమెరికాకు కూడా మీరు కార్లను ఉత్పత్తి చేయాల్సి ఉంది. కానీ మీరు వాటిపై 35 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది'' అని ట్రంప్ హెచ్చరించినట్టు ఆ న్యూస్పేపర్ జర్మన్లో అనువాదించింది. మెక్సికోలో ఫ్యాక్టరీ ఏర్పరిచి, 35 శాతం పన్ను చెల్లించకుండా అమెరికాలో కార్లను అమ్మాలనుకుంటున్న బీఎండబ్ల్యూ ఆ విషయాన్ని మర్చిపోవాలని ట్రంప్ హెచ్చరించినట్టు న్యూస్ పేపర్ పేర్కొంది.
ఈ నేపథ్యంలో అంతర్జాతీయంగా బీఎండబ్ల్యూ షేర్లు 2.2 శాతం, ఫోక్స్వాగన్, డైమ్లెర్ షేర్లు 2 శాతం పడిపోయాయి. మెక్సికోలో కార్లను రూపొందించాలనుకుంటున్న జపాన్ టయోటాకు ట్రంప్ వార్నింగ్ ఇచ్చారు. అయితే ఈ మూడు జర్మన్ కంపెనీలు అమెరికాలోనూ తయారీ సంస్థలను మంచిగానే ఏర్పాటుచేసినట్టు తెలిసింది. పారిశ్రామిక ఉద్యోగాలు పునరుద్ధరిస్తానని ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీపై వస్తున్న ఒత్తిడి కింద ట్రంప్ కార్ల కంపెనీలపై దృష్టిసారించినట్టు తెలుస్తోంది.
Advertisement
Advertisement