
ఎల్.కె.అద్వానీ
ఢిల్లీ: 2014 ఎన్నికల విజయంపై అతివిశ్వాసం వద్దని బిజెపి అగ్రనేత ఎల్.కె.అద్వానీ ఆ పార్టీ నేతలకు హితవు పలికారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. 2004 ఎన్నికల్లో బీజేపీ ఓటమికి ఇది కూడా ఓ కారణం అన్నారు.
బీజేపీ అధికారంలోకి రావడానికి చేసే యత్నాల్లో ఎలాంటి లోపం ఉండకూడదని జాగ్రత్తలు చెప్పారు.