కైరో: ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీకి తిరిగి పదవి అప్పగించాలంటూ నిరసనలు సాగిస్తున్న ముస్లిం బ్రదర్‌హుడ్ పార్టీపై నిషేధం విధించాలని ఈజిప్టు తాత్కాలిక ప్రభుత్వం భావిస్తోంది. బ్రదర్‌హుడ్‌పై నిషేధం విధించాలంటూ తాత్కాలిక ప్రధాని హజేమ్ బెబ్లావీ ముందుకు తెచ్చిన ప్రతిపాదనను పరిశీలిస్తోంది. కైరోలోని అల్-ఫతే మసీదులో తలదాచుకున్న ఈజిప్టు పదవీచ్యుత అధ్యక్షుడు మహమ్మద్ ముర్సీ మద్దతుదారులను భద్రతా బలగాలు ఖాళీ చేయించిన దరిమిలా ఆదివారం ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు పిలుపునిచ్చిన బ్రదర్‌హుడ్, పలుచోట్ల నిరసన కార్యక్రమాలను భద్ర తా కారణాల రీత్యా ఉపసంహరించుకుంది. కాగా, గడచిన నాలుగు రోజులుగా వీధుల్లో చెలరేగుతున్న హింసాకాండలో మరణించిన వారిసంఖ్య 800 దాటిం ది. నిరసనకారులపై ప్రభుత్వ బలగాలు బలప్రయోగానికి దిగడంపై ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కి మూన్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈజిప్టులో ముస్లిం బ్రదర్‌హుడ్‌పై నిషేధం!
Published Mon, Aug 19 2013 4:24 AM | Last Updated on Thu, Jul 11 2019 6:15 PM
Advertisement
Advertisement