కరణ్ థాపర్ కు ప్రతిష్టాత్మక అవార్డు
Published Wed, Feb 8 2017 6:58 PM | Last Updated on Tue, Sep 5 2017 3:14 AM
న్యూఢిల్లీ : జర్నలిజంలో అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రముఖ పాత్రికేయుడు, టీవీ యాంకర్ కరణ్ థాపర్కు ఎంతో ప్రతిష్టాత్మకమైన జీకే రెడ్డి మెమోరియల్ అవార్డు దక్కింది. 2016 సంవత్సరానికి గాను కరణ్ థాపర్ను ఈ అవార్డుకు ఎంపికచేసినట్టు టీఎస్ఆర్ ఫౌండేషన్ అవార్డు కమిటీ తెలిపింది. టీఎస్ఆర్ ఫౌండేషన్ కన్వినర్ టి. సుబ్బరామి రెడ్డి ఈ అవార్డును సుప్రసిద్ధ పాత్రికేయుడు జీకే రెడ్డి స్మారకార్థం ఏర్పాటుచేశారు. ఏటా పాత్రికేయ రంగానికి చెందిన ఒకరిని ఈ అవార్డుతో టీఎస్‌ఆర్ ఫౌండేషన్ సత్కరిస్తోంది.
చైర్మన్ కరణ్ సింగ్ నేతృత్వంలోని టీఎస్ఆర్ ఫౌండేషన్ అవార్డు కమిటీ సభ్యులు ఆనంద్ శర్మ, కాంత జీకే రెడ్డి, డాక్టర్ సుబ్బరామి రెడ్డి ఏకగ్రీవంగా కరణ్ థాపర్ను ఈ అవార్డుకు ఎంపికచేశారు. ఈ అవార్డు కింద రూ.5 లక్షల నగదు బహుమతి, బంగారం పతకం, స్పెషల్ ట్రోపి కరణ్ థాపర్కు బహుకరించనున్నారు.. న్యూఢిల్లీలో ఈ అవార్డు ఫంక్షన్ను బుధవారం ఘనంగా నిర్వహించనున్నారు. ఐటీవీకి కరణ్ థాపర్ అధ్యక్షుడు. బీబీసీ, దూరదర్శన్, ఛానెల్ న్యూస్ ఆసియాలకు ఈ ప్రొడక్షన్ హౌస్ ప్రొగ్రామ్లు రూపొందిస్తోంది.
Advertisement
Advertisement