ఉద్యోగులకు కొత్త ఈసీఆర్ వెర్షన్
Published Wed, Dec 14 2016 8:31 PM | Last Updated on Mon, Sep 4 2017 10:44 PM
ఎలక్ట్రానిక్ విధానంలో రిటర్న్లు దాఖలు చేయడానికి, రెమిటెన్స్ల చెల్లింపులకు ఉద్యోగులకు మరింత సౌకర్యవంతంగా ఉండటానికి ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) లో తర్వాతి తరం వెర్షన్ను ఆవిష్కరించనున్నట్టు ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్(ఈపీఎఫ్ఓ) పేర్కొంది.. ఈ కొత్త వెర్షన్ను డిసెంబర్ 20 నుంచి అందుబాటులోకి తీసుకొస్తామని అడిషనల్ సెంట్రల్ పీ.ఎఫ్ కమిషనర్-1(తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) పీడీ సిన్హా ప్రకటించారు. అయితే ముందస్తుగా 17 డిసెంబర్న సాయంత్రం ఆరుగంటల వరకు ఈ కొత్త ఈసీఆర్(ఎలక్ట్రానిక్ చలాన్ కమ్ రిటర్న్) వెర్షన్ అందుబాటులో ఉంచనున్నట్టు తెలిపారు.
ఉద్యోగులందరూ తమ నవంబర్ నెల జీతాల్లోని రెమిటెన్స్ చెల్లింపులను నిర్ణయించిన సమయం లోపల చెల్లించాలని ఆదేశించారు. అనంతరం సవరించిన పోర్టల్ను కొత్తగా డిసెంబర్ 20న ఆవిష్కరిస్తామని చెప్పారు. ఈపీఎఫ్ఓలో ఉద్యోగులు రిజిస్ట్రర్ చేసిన ఈ-మెయిల్కు దీనికి సంబంధించిన వివరాలను అందిస్తామన్నారు. నమోదుచేసుకున్న మొబైల్ ఫోన్ నెంబర్కు పోర్టల్ లింక్ను కూడా పంపిచనున్నట్టు సిన్హా వెల్లడించారు.
Advertisement