పరిశ్రమలు పడకే.. | Factory Output Contracts Further At Minus 2.2% In June | Sakshi
Sakshi News home page

పరిశ్రమలు పడకే..

Published Tue, Aug 13 2013 1:49 AM | Last Updated on Fri, Sep 1 2017 9:48 PM

పరిశ్రమలు పడకే..

పరిశ్రమలు పడకే..

 న్యూఢిల్లీ: దేశీయంగా పరిశ్రమలు ఇంకా గడ్డుపరిస్థితుల్లోనే కొట్టుమిట్టాడుతున్నాయి. జూన్‌లో కూడా పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) తిరోగమనంలో కొనసాగింది.. వరుసగా రెండవ నెలలోనూ పారిశ్రామిక ఉత్పత్తిలో అసలు వృద్ధిలేకపోగా  క్షీణతను నమోదుచేసుకుంది. ఈ పరిమాణం (-) 2.2 శాతంగా నమోదయ్యింది. మే నెలతో (-2.8 శాతం) పోల్చితే క్షీణత కొంత తగ్గింది. గత ఏడాది జూన్‌తో (-2.0 శాతం) పోల్చితే పరిస్థితి మరింత దిగజారింది. కేంద్ర గణాంకాల సంస్థ (సీఎస్‌ఓ) సోమవారం ఈ గణాంకాలను విడుదల చేసింది. గత ఏడాది జూన్‌తో పోల్చితే 2013 జూన్‌లో కీలక రంగాల పరిస్థితి ఇలా...
 తయారీ: మొత్తం సూచీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన ఈ రంగం ఉత్పత్తి -2.2 శాతం క్షీణించింది. 2012 ఇదే నెలలో ఈ క్షీణత 3.2 శాతం. 
 
 తయారీ రంగంలోని మొత్తం 22 పారిశ్రామిక గ్రూప్‌లలో 13 గ్రూప్‌లు ప్రతికూల వృద్ధిని నమోదుచేసుకున్నాయి. మైనింగ్:  క్షీణత మరింత క్షీణతలోకి జారింది. -1.1 శాతం నుంచి -4.1 శాతానికి దిగింది.విద్యుత్ రంగం: 2012 జూన్‌లో 8.8 శాతం వృద్ధి సాధించగా, 2013 ఇదే నెలలో అసలు వృద్ధి చోటుచేసుకోలేదు. భారీ యంత్ర పరికరాలు (క్యాపిటల్ గూడ్స్): ఈ రంగం ఉత్పాదకత  క్షీణత బాటలోనే కొనసాగింది. అయితే ఈ రేటు -27.7 శాతం నుంచి -6.6 శాతానికి తగ్గింది. వినిమయ వస్తువులు: ఉత్పత్తి రేటు 2.3 శాతం క్షీణతను నమోదుచేసుకుంది. 2012 జూన్‌లో ఈ క్షీణత రేటు 3.7 శాతం. 
 
 మొదటి క్వార్టర్‌లో...
 ఇక ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్ (2013-14 ఏప్రిల్-జూన్)లో గత ఏడాది ఇదే కాలంతో పోల్చితే పరిస్థితి మెరుగుపడలేదు. క్షీణత -0.2% నుంచి -1.1 శాతానికి జారింది. తయారీ రంగం ఉత్పత్తి -0.8 క్షీణతలోంచి మరింతగా -1.2 శాతానికి దిగింది. మైనింగ్ రంగం ఉత్పత్తి కూడా 1.6 క్షీణతలోంచి మరింతగా - 4.5 శాతానికి పడింది. విద్యుత్ రంగంలో వృద్ధి ఉన్నా, ఇది 6.4 శాతం నుంచి 3.5 శాతానికి పడిపోయింది. క్యాపిటల్ గూడ్స్ ఉత్పత్తిలో క్షీణత రేటు 20.1% నుంచి 3.3 శాతానికి తగ్గింది. వినిమయ వస్తువుల ఉత్పత్తి 2.4 క్షీణతను నమోదుచేసుకుంది. గత ఏడాది ఈ రంగం 4 శాతం వృద్ధిని నమోదుచేసుకుంది. కాగా,  పారిశ్రామిక రంగం తిరోగమనం నేపథ్యంలో రానున్న పాలసీ సమీక్షలోనైనా ఆర్‌బీఐ వడ్డీరేట్లు తగ్గించాలని కార్పొరేట్లు డిమాండ్ చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement