బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ | Former Congress Stalwart SM Krishna is Now a BJP Member | Sakshi
Sakshi News home page

బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ

Published Wed, Mar 22 2017 10:53 PM | Last Updated on Fri, Mar 29 2019 9:31 PM

బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ - Sakshi

బీజేపీలో చేరిన ఎస్‌ఎం కృష్ణ

న్యూఢిల్లీ: కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత ఎస్‌.ఎం.కృష్ణ బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా, సీనియర్‌ నేతలు అనంత్‌కుమార్, మురళీధర్‌ రావు సమక్షంలో బుధవారం ఢిల్లీలో ఆయన పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. ఈ సందర్భంగా అమిత్‌షా పార్టీ కండువా కప్పి ఎస్‌.ఎం.కృష్ణను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.

అనంతరం ఎస్‌.ఎం.కృష్ణ మాట్లాడుతూ, తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో ఇప్పుడు కొత్త ప్రయాణం ఆరంభమవుతోందని, బీజేపీలో చేరడం తనకు సంతోషంగా ఉందని అన్నారు. కర్ణాటకలోనూ, జాతీయ రాజకీయాల్లోనూ తాను గతంలో పలు కీలక పదవులు చేపట్టానని అన్నారు. అటల్‌ బిహారీ వాజ్‌పేయి వంటి పలువురు బీజేపీ నేతలతోనూ తనకు అనుబంధం ఉందని గుర్తు చేసుకున్నారు. ఎస్‌.ఎం.కృష్ణ... బీజేపీలో చేరడంతో కర్ణాటకలో తమ పార్టీ మరింత బలపడుతుందని అమిత్‌షా అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement