'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై' | Will quit politics if there is an iota of proof against me or my family members' integrity: Rajnath Singh | Sakshi
Sakshi News home page

'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'

Published Wed, Aug 27 2014 2:32 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై' - Sakshi

'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'

న్యూఢిల్లీ: నా కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించానని రాజ్ నాథ్ తెలిపారు.
 
రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. పంకజ్ సింగ్ వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలు. రాజకీయ దురుద్దేశంతో చేసినవని పీఎంవో తెలిపింది. 
 
అవినీతి, చెడు ప్రవర్తన కారణంగానే నరేంద్రమోడీ బీజేపీ టికెట్ ను నిరాకరించారనే వార్తలు ఇటీవల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నోయిడా టికెట్ ను పంకజ్ సింగ్ ఇవ్వడానికి మోడీ నిరాకరించారనే వార్తలు గతంలో వెలువడిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement