Pankaj Singh
-
అదరగొట్టారు.. ఎవరీ పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవ?
టీమిండియా జట్టుకు ఆడాలని ప్రతీ క్రికెటర్ కలగనడం సహజం. కానీ తుది జట్టులో 11 మందికి మాత్రమే అవకాశం ఉంటుంది. టన్నుల కొద్ది టాలెంట్ ఉన్నప్పటికి కొందరు అనామక క్రికెటర్లుగా మిగిలిపోతున్నారు. మరికొందరు మాత్రం జెంటిల్మెన్ గేమ్ అని చెప్పుకునే క్రికెట్లో నీచ రాజకీయాల వల్ల ఆటకు దూరం కావాల్సి వస్తుంది. గతంలో జరిగింది.. ఇప్పుడు జరుగుతుంది.. ఇకపై కూడా ఇలాంటి రాజకీయాలు కంటిన్యూ అవుతూనే ఉంటాయి. అందుకు సంజూ శాంసన్ చక్కటి ఉదాహరణ. మంచి బ్యాటింగ్ టెక్నిక్ గల సంజూ శాంసన్‌కు టి20 ప్రపంచకప్‌కు మరోసారి మొండిచేయి ఎదురైంది. అతన్ని ఎంపిక చేయకపోవడంపై అన్నివైపుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.ఇప్పుడంటే ఐపీఎల్ లాంటి క్రికెట్ లీగ్స్‌తో జాతీయ జట్టుకు ఆడకపోయినా దండిగానే డబ్బులు సంపాదిస్తున్నారు. తాజాగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా ఇండియా మహారాజాస్‌కు ఆడిన పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు అద్బుత ప్రదర్శన చేశారు. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగి బౌలింగ్‌లో అదరగొడితే.. మరొకరు బ్యాటింగ్‌లో హాఫ్ సెంచరీ సాధించి క్లాస్ ప్రదర్శన చేశాడు. అద్భుత ప్రదర్శనతో పంకజ్ సింగ్, తన్మయ్ శ్రీవాత్సవలు తమ గురించి మాట్లాడుకునేలా చేశారు. ఎవరీ పంకజ్ సింగ్? ఉత్తరప్రదేశ్‌కి చెందిన పంకజ్ సింగ్, టీమిండియా తరుపున 2 టెస్టులు, ఓ వన్డే మ్యాచ్ ఆడాడు. ఇంగ్లాండ్‌తో జరిగిన రెండు టెస్టుల్లో 2 వికెట్లు మాత్రమే తీసిన పంకజ్, శ్రీలంకతో జరిగిన ఏకైక వన్డేలో వికెట్ తీయలేక జట్టులో చోటు కోల్పోయాడు. తన రెండో టెస్టులో పంకజ్ సింగ్ జో రూట్, జోస్ బట్లర్‌లను ఔట్ చేశాడు . మొదటి మ్యాచ్‌లో పంకజ్ సింగ్ బౌలింగ్‌లో అలిస్టర్ కుక్ ఇచ్చిన క్యాచ్‌ని రవీంద్ర జడేజా డ్రాప్ చేశాడు. ఆ మ్యాచ్‌లో వికెట్ తీయలేకపోయిన పంకజ్.. అరంగ్రేట మ్యాచ్‌లో వికెట్ తీయకుండా అత్యధిక పరుగులు ఇచ్చిన బౌలర్‌గా చెత్త రికార్డు మూటకట్టుకున్నాడు. ఆ మ్యాచ్‌లో పంకజ్ సింగ్ ఏకంగా 179 పరుగులు సమర్పించుకున్నాడు. అయితే ఫస్ట్ క్లాస్ క్రికెట్లో మాత్రం పంకజ్ సింగ్‌కి ఘనమైన రికార్డు ఉంది. 117 ఫస్ట్ క్లాస్ మ్యాచులు ఆడిన పంకజ్ సింగ్ 472 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 28 సార్లు ఐదేసి వికెట్లు తీశాడు. 76 లిస్టు ఏ మ్యాచ్‌లో 115 వికెట్లు తీశాడు. ఐపీఎల్ ద్వారా పరిచయం.. పంకజ్ సింగ్‌తో పాటు తన్మయ్ శ్రీవాస్తవ కూడా హాఫ్ సెంచరీతో ఆకట్టుకుని ఇండియా మహారాజాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. టీమిండియా తరుపున ఒక్క మ్యాచ్ కూడా ఆడలేకపోయిన తన్మయ్.. ఐపీఎల్లో మాత్రం కింగ్స్ ఎలెవన్ పంజాబ్, కొచ్చి టస్కర్స్ కేరళ, డెక్కన్ ఛార్జర్స్ తరపున ఆడాడు.34 మ్యాచుల్లో 649 పరుగులు చేశాడు. ఇక ఫస్ట్ క్లాస్ కెరీర్లో తన్మయ్ శ్రీవాస్తవ 10 సెంచరీలు, 27 హాఫ్ సెంచరీలతో 4918 పరుగులు చేశాడు.లిస్టు ఏ క్రికెట్లో 7 సెంచరీలు, 50 హాఫ్ సెంచరీలు చేసిన తన్మయ్... 2020లో క్రికెట్‌కి రిటైర్మెంట్ ప్రకటించాడు. చదవండి: పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం 'మొన్ననే కదా ఫైనల్ చేరారు.. అంత మాట ఎలా అంటావు!' -
పఠాన్ బ్రదర్స్ విధ్వంసం.. ఇండియా మహారాజాస్ ఘన విజయం
ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా లెజెండ్స్ లీగ్ క్రికెట్లో భాగంగా బీసీసీఐ ఇండియా మహారాజాస్, వరల్డ్ జెయింట్స్ మధ్య ఎగ్జిబిషన్ మ్యాచ్ నిర్వహించింది. కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా శుక్రవారం జరిగిన మ్యాచ్‌లో ఇండియా మహారాజాస్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం అందుకుంది. పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. బ్యాటింగ్‌లో తన్మయ్ శ్రీవాత్సవ, యూసఫ్ పఠాన్లు హాఫ్ సెంచరీలతో చెలరేగి జట్టుకు విజయాన్ని అందించారు. మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన వరల్డ్ జెయింట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 170 పరుగులు చేసింది. కెవిన్ ఒబ్రెయిన్ 52, దినేశ్ రామ్‌దిన్(42 పరుగులు నాటౌట్), తిసార పెరీరా 23 పరుగులతో రాణించారు. ఇండియా మహారాజాస్ బౌలింగ్‌లో పంకజ్ సింగ్ ఐదు వికెట్లతో చెలరేగగా.. హర్భజన్ సింగ్, మహ్మద్ కైఫ్, జోగిందర్ శర్మ తలా ఒక వికెట్ తీశారు. అనంతరం 171 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా మహారాజాస్ 18.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను అందుకుంది. వీరేంద్ర సెహ్వాగ్ 4 పరుగులు చేసి నిరాశ పరచగా.. తన్మయ్ శ్రీవాత్సవ 39 బంతుల్లో 54 పరుగులు చేశాడు. చివర్లో పఠాన్ బ్రదర్స్.. యూసఫ్ పఠాన్ 35 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 50 నాటౌట్, ఇర్ఫాన్ పఠాన్ 9 బంతుల్లో 3 సిక్సర్లతో 20 పరుగులు చేసి జట్టును గెలిపించారు. వరల్డ్ జెయింట్స్ బౌలింగ్‌లో టిమ్ బ్రెస్నన్ 3 వికెట్లు తీయగా.. ఫిడెల్ ఎడ్వర్డ్స్ ఒక వికెట్ తీశాడు. చదవండి: ఫెదరర్ ఆస్తి విలువ ఎంతో తెలుసా? -
తొలిదశలో 64 శాతం పోలింగ్
► యూపీలో 73 నియోజకవర్గాలకు ముగిసిన ఎన్నికలు ► ఓటింగ్ స్వల్ప హింసాత్మకం లక్నో: దేశమంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఉత్తరప్రదేశ్ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలో తొలిదశ కింద శనివారం 15 జిల్లాల్లోని 73 నియోజకవర్గాలకు ఎన్నికలు ముగిశాయి. ఓటింగ్ సందర్భంగా అక్కడక్కడా స్వల్ప హింసాత్మక ఘటనలు జరిగాయి. 64.22 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. ఓటరు స్లిప్‌లను దౌర్జన్యంగా లాక్కోవడం, రాళ్లు రువ్వుకోవడం వంటి ఘటనలు తమ దృష్టికి వచ్చాయని ముఖ్య ఎన్నికల అధికారి వెంకటేష్ చెప్పారు. ఇవే నియోజకవర్గాల్లో 2012 ఎన్నికలతో పోలిస్తే తాజాగా పోలింగ్ మూడు శాతం పెరిగింది. ఈ దశలో మొత్తం ఓటర్లు 2.6 కోట్లు కాగా వారిలో 1.17 కోట్ల మంది మహిళలు. 839 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇప్పటిదాకా ఎన్నికల సంఘం ఇక్కడ రూ.9.56 కోట్ల నగదు, 14కోట్ల విలువైన 4.44 లక్షల లీటర్ల మద్యం, రూ.14 కోట్ల విలువైన ఆభరణాలను స్వాధీనం చేసుకుంది. శనివారం హాపూర్, షామ్లీ, ముజఫర్‌నగర్, బాగ్పట్, మీరట్, ఘజియాబాద్, గౌతమ బుద్ధ నగర్, బులంద్ షహర్, అలీగఢ్, మథుర, హత్రాస్, ఆగ్రా, ఫిరోజాబాద్, ఎటా, కాస్గంజ్ జిల్లాల్లో పోలింగ్ ముగిసింది. ఉత్తరప్రదేశ్‌లోని మొత్తం జిల్లాలు 75. మీరట్, బాగ్‌పట్‌లో ఘర్షణలు... బాగ్‌పట్‌లో ఓటర్లను అడ్డుకుంటున్నారంటూ వివిధ వర్గాల మధ్య జరిగిన ఘర్షణల్లో 10 మంది గాయపడ్డారు. బాగ్పట్ జిల్లాలోని మరో గ్రామంలో ఆర్ఎల్డీ కార్యకర్తలు దళితులను ఓటు వేయకుండా అడ్డుకోగా పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మీరట్‌లో ఓ బీజేపీ నేత సోదరుడు పోలింగ్ బూత్‌కు తుపాకీ తేవడంతో పోలీసులు అరెస్టుచేశారు. తొలిదశలోని ప్రముఖులు వీరే... తొలిదశ పోలింగ్ జరిగిన నియోజకవర్గాల్లో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ తనయుడు పంకజ్ సింగ్ (నోయిడా), కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు ప్రదీప్ మాథుర్ (మధుర), బీజేపీ అధికార ప్రతినిధి శ్రీకాంత్‌శర్మ, బీజేపీ ఎంపీ హుకుమ్ సింగ్ కూతురు మృగాంకా సింగ్ (కైరానా), బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు లక్ష్మీ కాంత్ (మీరట్), ఆర్జేడీ అధినేత లాలూ అల్లుడు రాహుల్ సింగ్ (సికింద్రాబాద్), రాజస్తాన్ గవర్నర్ కల్యాణ్‌సింగ్ మనవడు సందీప్ (అత్రౌలి) తదితర ప్రముఖులు పోటీలో నిలిచారు. బీజేపీ ఖాతాలోకి 3 ఎమ్మెల్సీలు రాష్ట్రంలోæ అసెంబ్లీ ఎన్నికల హడావుడి నడుస్తుండగానే.. బీజేపీకి శుభ సంకేతాలు కనబడుతున్నాయి. కాన్పూర్, బరేలీ, గోరఖ్‌పూర్ స్థానాలకు జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచింది. ఈ మూడు చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు పూర్తి ఆధిపత్యం కనబరిచారు. కేంద్ర ప్రభుత్వంపై నమ్మకం, పేదల సంక్షేమం దృష్టిలో పెట్టుకుని మోదీ తీసుకొచ్చిన పథకాలే తమను గెలిపించాయని అభ్యర్థులు తెలిపారు. కాగా, ఈ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించటమే.. యూపీలో మళ్లీ కమలం వికసించేందుకు సంకేతమని కేంద్ర మంత్రి వెంకయ్య అన్నారు. -
'రాజ్‌నాథ్ కొడుకులా కాదు.. కార్యకర్తగా వస్తున్నా'
లక్నో: ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్, కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి తానేం తక్కువ కాదని కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్ అన్నారు. ఇప్పుడప్పుడే వారిపై తాను ఎలాంటి రాజకీయపరమైన వ్యాఖ్యలు చేయబోనని అన్నారు. త్వరలో జరగబోతున్న ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో నోయిడా నుంచి ఎమ్మెల్యేగా పంకజ్ బీజేపీ తరుపున బరిలోకి దిగాడు. వాస్తవానికి అధికారంలో ఉన్న రాజకీయ నాయకుల పిల్లల పోటీ చేయొద్దని ప్రధాని మోదీ నిబంధన పెట్టినప్పటికీ ఇప్పటికే రాష్ట్రంలోని పలు చోట్ల పలువురు నేతలు తమ పిల్లలను, మనుమళ్లనుమనువరాళ్లను బరిలోకిదించారు. అయితే, తన ఆరంగేట్రాన్ని పంకజ్ సమర్థించుకున్నారు. మోదీ పెట్టిన నిబంధనను తాను మీరలేదన్నారు. తాను తన తండ్రి రాజ్‌నాథ్ సింగ్ అసలు రాజకీయాలు మాట్లాడుకోమని, ఎప్పుడూ ఆయన ఆశీస్సులు మాత్రమే తీసుకుంటానని అన్నారు. తాను కేంద్ర హోంమంత్రి కొడుకులా కాకుండా ఓ కార్యకర్తలా వస్తున్నానని అన్నారు. చాలా ఏళ్లుగా పార్టీకోసం పనిచేస్తున్న పంకజ్ 2014లోనే సీటు కోరుకున్నప్పటికీ అప్పటి నేతలు ఎంపికచేయలేదని, ఇప్పుడు ఆయన తండ్రి స్థాయిని చూసి కాకుండా రాజకీయ సేవను చూసి సీటు ఇచ్చినట్లు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే, నోయిడాలో ఇప్పటికే ఉన్న సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న ఓం మార్థుర్‌ని పక్కకు పెట్టి మరీ పంకజ్‌కు సీటు ఇచ్చారంట. దీనిపై స్థానిక పార్టీ క్యాడర్ మొత్తం అసంతృప్తిగా ఉన్నారని వార్తలు వస్తుండగా తాము ఇప్పటికే అందరితోనూ చర్చలు జరిపి వారు అంగీకరించాకే తనకు ఆ సీటు కేటాయించారని పంకజ్ తెలిపారు. తనను 200శాతం తగినవాడిని అని భావించారని, స్థానికుల మద్దతు తనకే ఉందని స్పష్టం చేశారు. -
ఆ విషయంలో హోం మంత్రికి కోపం లేదు
లక్నో: త్వరలో జరిగే ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వారసులు బరిలో దిగుతున్నారు. సమాజ్‌వాదీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం సింగ్ యాదవ్ బంధుగణం, ఆ పార్టీ సీనియర్ నేతల వారసులతో పాటు బీజేపీ సీనియర్ నేతల వారసులు కూడా రంగంలోకి దిగారు. కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్, బీజేపీ మరో సీనియర్ నేత లాల్జీ టాండన్ కొడుకు గోపాల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. బీజేపీ నేతల వారసులకు టికెట్లు ఇవ్వడాన్ని ఆ పార్టీ యూపీ వ్యవహారాల ఇంచార్జి ఓం మాధుర్ సమర్ధించుకున్నారు. నోయిడా నుంచి పంకజ్ పోటీచేస్తున్నారు. బీజేపీ ఇటీవల విడుదల చేసిన అభ్యర్థుల జాబితాలో పంకజ్‌కు టికెట్ దక్కింది. పంకజ్‌కు గత ఎన్నికల్లో టికెట్ ఇవ్వనందుకు రాజ్‌నాథ్ సింగ్ మనస్తాపం చెందారని వచ్చిన వార్తలను మాధుర్ తోసిపుచ్చారు. పంకజ్‌కు టికెట్ ఇవ్వాలని కేంద్ర హోం మంత్రి ఎప్పుడూ అడగలేదని, ఈ విషయంలో ఆయన జోక్యం చేసుకోలేదని, గతంలో టికెట్ ఇవ్వనందుకు కోప్పడ్డారన్న ప్రచారంలో వాస్తవం లేదని చెప్పారు. గత 15 ఏళ్లుగా పంకజ్ పార్టీలో పనిచేస్తున్నారని, ఆఫీస్ బేరర్‌గా ఉన్నారని, ఎన్నికల్లో పోటీచేయడానికి ఆయన 200 శాతం అర్హుడని మాధుర్ అన్నారు. మరో నేత లాల్జీ టాండన్ కొడుకు ఇప్పటికే చట్టసభ సభ్యుడిగా ఉన్నారని, మరోసారి ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. -
‘15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చింది’
లక్నో: అసెంబ్లీ స్థానానికి పోటీ చేయడానికి తాను 15 ఏళ్లు వేచిచూడాల్సి వచ్చిందని కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ తనయుడు పంకజ్ సింగ్ తెలిపారు. పార్టీ కార్యకర్తగా 15 ఏళ్లు కిందిస్థాయిలో పనిచేశానని ఆయన వెల్లడించారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయాలనేది తమ పార్టీ నాయకత్వం నిర్ణయిస్తుందని, తాను సామాన్య కార్యకర్తనని చెప్పారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో నోయిడా నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిగా పంకజ్ సింగ్ పోటీ చేయనున్నారు. 155 స్థానాలకు ఆదివారం బీజేపీ విడుదల చేసిన రెండో జాబితాలో ఆయన పేరు కూడా ఉంది. రాజ్ నాథ్ తనయుడు కావడంతో పంకజ్ పై అందరి దృష్టి నెలకొంది. యూపీ బీజేపీ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఆయన తొలిసారిగా ఎన్నికల బరిలో నిలిచారు. -
మీరు జర్నలిస్తులు.. వారిని మీరే గుర్తించాలి
లక్నో: మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టులు.. నా కోడుకుపై రూమర్లు సృష్టిస్తున్న వారిని మీరే పట్టుకోవాలని కేంద్ర హోం మంత్రి రాజ్ నాథ్ సింగ్ స్పందించారు. తన కుమారుడిపై వస్తున్న ఆరోపణల్ని ఖండించారు. తన కుమారుడిపై రూమర్లు సృష్టిస్తున్న వారేవరో తనకు తెలియదని.. వారి గురించి తాను ఆలోచించడం లేదని ఓ ప్రశ్నకు రాజ్ నాథ్ స్పందించారు. తన కుటుంబ సభ్యుల దుష్ప్రవర్తన ఉన్నట్టు రుజువైనట్లయితే తాను రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ సింగ్ మరోసారి స్పష్టం చేశారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ ప్రవర్తనపై ప్రధాన మంత్రి కార్యాలయం స్పందించిన సంగతి తెలిసిందే. -
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్
ఎన్డీయే మంత్రులకు 'సన్' స్ట్రోక్ తగులుతోంది. కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ తనయుడి వివాదం మరవక ముందే మరో కేంద్రమంత్రి కూడా వార్తల్లో నిలిచారు. తాజాగా కేంద్ర రైల్వేశాఖ మంత్రి సదానంద గౌడ కుమారుడు కార్తీక్ గౌడపై రేప్ కేసు నమోదు అయ్యింది. తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడంటూ కార్తీక్‌గౌడపై వర్ధమాన నటి మైత్రేయి గౌడ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. దాంతో అతనిపై రేప్, చీటింగ్ కేసు నమోదు అయ్యాయి. ఈ కేసు విషయంలో కార్తీక్ గౌడ అరెస్ట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలను సదానంద గౌడ కొట్టిపారేశారు. అవన్నీ నిరాధారమేనని తేల్చిపారేశారు. అయితే పోలీసులు మాత్రం మంత్రి కుమారుడిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి...తన పని తాము చేసుకు పోతున్నారు. మరోవైపు రాజ్‌నాథ్ సింగ్ కుమారుడు పంకజ్ సింగ్‌పై ఆరోపణల వ్యవహారం రాజకీయ దుమారంగా మారిన విషయం తెలిసిందే. ఉత్తర ప్రదేశ్‌లో బీజేపీ నేతగా ఉన్న పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. కాగా మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. అయితే తన కుమారుడిపై వచ్చిన ఆరోపణలు వాస్తవమని తేలితే రాజకీయాల నుంచి వైదొలగుతానని రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించటం విశేషం. ఏది ఏమైనా ఇద్దరు కేంద్ర మంత్రులు తమ సుపుత్రుల ద్వారా ప్రముఖంగా వార్తల్లోకి నిలవటం విశేషం. -
రాజ్‌నాథ్ తనయుడిపై వివాదం
* దిద్దుబాటు చర్యల్లో బీజేపీ, పీఎంఓ * రాజ్‌నాథ్ కుమారుడిపై ప్రధాని ఆగ్రహం అంటూ మీడియాలో వార్తలు * అవన్నీ పచ్చి అబద్ధాలంటూ పీఎంఓ వివరణ * రుజువు చేస్తే రాజకీయాల నుంచి తప్పుకుంటా: రాజ్‌నాథ్ న్యూఢిల్లీ: కేంద్ర హోంమంత్రి, రాజ్‌నాథ్ సింగ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణల వ్యవహారం బుధవారం రాజకీయ దుమారంగా మారింది. రాజ్‌నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ వ్యవహార శైలిపై ప్రధాని నరేంద్రమోడీ ఆగ్రహంగా ఉన్నారని, అవినీతి ఆరోపణలపై పంకజ్‌ను మందలించారని, దీనిపై రాజ్‌నాథ్ వివరణ ఇచ్చారని మీడియాలో వార్తలు సంచలనంగా మారాయి. దీంతో దిద్దుబాటు చర్యలు ప్రారంభించిన రాజ్‌నాథ్‌సింగ్, ప్రధాని కార్యాలయం, బీజేపీలు బుధవారం వేర్వేరుగా వివరణలు ఇచ్చాయి. తన కుమారుడి ప్రవర్తనకు సంబంధించి వచ్చిన ఆరోపణలను రాజ్‌నాథ్ తీవ్రంగా ఖండించారు. తనపై, తన కుటుంబ సభ్యులపై వచ్చిన ఆరోపణలను ఏ మాత్రం రుజువుచేసినా రాజకీయాల నుంచి తప్పుకుని ఇంట్లో కూర్చుంటానని ఘాటుగా స్పందించారు. నార్త్‌బ్లాక్‌లోని తన కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన వివరణ ఇచ్చారు. ఈ విషయంపై ప్రధానితో, పార్టీ అధ్యక్షుడు అమిత్ షాతో మాట్లాడానని, వారు కూడా ఆ వార్తలను ఖండించారన్నారు. పార్టీలో, మంత్రివర్గంలో తనకు ప్రత్యర్థిగా ఉన్న ఒక సీనియర్ నేతే ఈ వదంతులను వ్యాపింపజేస్తున్నారని రాజ్‌నాథ్ ఆగ్రహంగా ఉన్నారన్న వార్తలపై ప్రశ్నించగా.. ఆ విషయాన్ని జర్నలిస్టులుగా మీరే కనుక్కోవాలని వ్యాఖ్యానించారు. అదే సమయంలో ప్రధాని కార్యాలయం(పీఎంఓ) నుంచి కూడా ఒక ప్రకటన వచ్చింది. రాజ్‌నాథ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలు పచ్చి అబద్ధాలని అందులో పేర్కొన్నారు. అవన్నీ ప్రభుత్వ ఇమేజ్ను దెబ్బతీసేందుకు చేస్తున్న కుట్రపూరిత ప్రయత్నాలు గా పీఎంఓ అభివర్ణించింది. బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా కూడా రాజ్‌నాథ్‌కు బాసటగా నిలిచారు. రాజ్‌నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలను ఖండిస్తున్నానన్నారు. సెప్టెంబర్ 13న జరగనున్న యూపీ ఉప ఎన్నికల్లో నోయిడా నుంచి పోటీ చేయాలని ఆశించిన పంకజ్‌కు పార్టీ టికెట్ నిరాకరించడం గమనార్హం. 2012 ఎన్నికల్లోనూ ఆయనకు అవకాశం ఇవ్వలేదు. విషయమేంటో చెప్పండి! ఈ అంశాన్ని ప్రతిపక్షాలు బీజేపీపై, మోడీ ప్రభుత్వంపై చురకలేసాయి. రాజ్‌నాథ్ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేంటో చెప్పాలని కాంగ్రెస్ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ వ్యాఖ్యానించారు. ‘ప్రతిపక్ష పార్టీగా మేమైతే ఎలాంటి ఆరోపణలు చేయలేదు. మరి మీరు ఏ ఆరోపణలపై వివరణ ఇస్తున్నారు? అసలు ఆరోపణలు చేసింది ఎవ రు? మీ కుమారుడిపై వచ్చిన ఆరోపణలేమిటో తెలుసుకోవాలని కాంగ్రెస్, దేశప్రజలు కోరుకుంటున్నార’ని అన్నారు. రాజ్‌నాథ్ కుటుంబసభ్యులపై వదంతులు ఎవరు వ్యాప్తి చేస్తున్నారో పీఎంఓ స్పష్టం చేయాలని వామపక్షాలు కోరాయి. కాగా, జేడీయూ, సమాజ్‌వాదీ పార్టీలు రాజ్‌నాథ్‌కు మద్దతుగా నిలిచాయి. ఇంతకీ వివాదమేంటి? బీజేపీ వర్గాల సమాచారం మేరకు అంటూ రాజ్‌నాథ్‌సింగ్ కుమారుడికి సంబంధించి మీడియాలో వస్తున్న వార్తలే వివాదానికి కారణాలయ్యాయి. ఆ వార్తల ప్రకారం ‘యూపీలో బీజేపీ నేతగా ఉన్న పంకజ్‌సింగ్.. పోలీసు నియామకాలకు సంబంధించి డబ్బులు తీసుకున్నారన్న విషయం మోడీ వరకు వచ్చింది. మోడీ రాజ్‌నాథ్‌ను, పంకజ్‌ను తన చాంబర్‌కు పిలిపించుకుని. పంకజ్‌ను ప్రశ్నించారు. ఆయనను మందలించారు. పోలీసు నియామకాలకు తీసుకున్న డబ్బులను తిరిగిచ్చేయాలంటూ ఆదేశించారు. మోడీ చాంబర్ నుంచి రాజ్‌నాథ్, పంకజ్‌లు తిరిగి వెళ్తున్న సమయంలోనూ.. మరోసారి ఇలాంటి ఫిర్యాదులు రాకుండా చూసుకోవాలని పంకజ్‌ను హెచ్చరించారు.’ మీడియాలో వచ్చిన ఈ వివాదం వెనుక రాజ్‌నాథ్ అంటే గిట్టని, ఆ హోదాను ఆశిస్తున్న ఓ సీనియర్ నేత ఉన్నారని ఆయన మద్దతుదారులు చెబుతున్నారు. -
'నా కొడుకుది తప్పని తేలితే పాలిటిక్స్ కు గుడ్ బై'
న్యూఢిల్లీ: నా కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు అని కేంద్ర హోంశాఖా మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం ఉంటే రాజకీయాల్లో నుంచి తప్పుకుంటానని రాజ్ నాథ్ స్పష్టం చేశారు. తన కుమారుడిపై వచ్చిన ఆరోపణల గురించి ప్రధాని నరేంద్రమోడీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్ షాతో చర్చించానని రాజ్ నాథ్ తెలిపారు. రాజ్ నాథ్ కుమారుడు పంకజ్ సింగ్ పై వచ్చిన ఆరోపణలు నిరాధారమని ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఓ ప్రకటనలో తెలిపింది. పంకజ్ సింగ్ వచ్చిన ఆరోపణలన్ని అవాస్తవాలు. రాజకీయ దురుద్దేశంతో చేసినవని పీఎంవో తెలిపింది. అవినీతి, చెడు ప్రవర్తన కారణంగానే నరేంద్రమోడీ బీజేపీ టికెట్ ను నిరాకరించారనే వార్తలు ఇటీవల రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. నోయిడా టికెట్ ను పంకజ్ సింగ్ ఇవ్వడానికి మోడీ నిరాకరించారనే వార్తలు గతంలో వెలువడిన సంగతి తెలిసిందే.