ఇస్లామాబాద్: పాకిస్థాన్లోని బాలోచిస్తాన్ ప్రాంతంలో నలుగురు పోలీసులను చంపేశారు. పెట్రోలింగ్ నిర్వహిస్తున్న పోలీసు వాహనంపై గుర్తు తెలియని వ్యక్తులు ఆయుధాలతో మోటార్ సైకిళ్లపై వచ్చి ఒక్కసారిగా కాల్పులు జరపడంతో ఇద్దరు అక్కడికక్కడే చనిపోగా మరో ఇద్దరు హాస్పిటల్ కు తరలిస్తుండగా ప్రాణాలు విడిచారు. క్వెట్టాలోని పస్తునాబాద్లో ఈ దారుణం చోటుచేసుకుంది.