అక్టోబరు 17వరకు గడువు పెంపు
న్యూఢిల్లీ: ఆదాయ పన్ను చట్టం ప్రకారం ఆడిట్ చేయాల్సిన ఖాతాదారుల ఆదాయ పన్ను చెల్లింపుకు గడువు తేదీని కేంద్ర ప్రభుత్వం పొడిగించింది. 2016 ఆదాయపు పన్ను చట్టం క్రింద వీరి ఐటీ రిటర్న్స్ దాఖలు తేదీని అక్టోబర్ 17 కు పెంచింది. పన్ను రిటర్న్స్ దాఖలు చేసే వారి అసౌకర్యానికి తొలగించే క్రమంలో ఈ గడువును పెంచినట్టు ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 2016 ఆదాయపు డిక్లరేషన్ పథకం కింద సెప్టెంబరు 30 చివరి తేదీని పరిగణనలోకి తీసుకొని, ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు ( సీబీడీటీ ) ఈ నిర్ణయం తీసుకుంది.
2015-16 సంవత్సరానికి గాను బిజినెస్ రీసీట్స్ కోటి రూపాయలకు మించిన లేదా ప్రొఫెనల్ రిసీట్స్ పాతిక లక్షలకు మించిన పన్ను చెల్లింపుదారులు తమ ఐటీ రిటర్న్స్ దాఖలు చేయడానికిగాను ఈ సౌకర్యాన్ని కల్పించింది. అక్టోబర్ 17 లోపు ఆయా ఆడిట్ రిపోర్ట్ తో కూడిన ఐటి రీటర్న్స్ ను ఫైల్ చేయాలని తెలిపింది.