న్యూఢిల్లీ: 23 ఏళ్ల విరామం తరువాత సముద్ర మార్గం ద్వారా హజ్ యాత్రికులను సౌదీ అరేబియాకు పంపించాలని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. హజ్ పాలసీ 2018 రూపకల్పన కోసం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయవచ్చని ప్రభుత్వానికి సిఫారసు చేసింది.
జలమార్గం ద్వారా హజ్ యాత్రికులను ముంబై నుంచి జెడ్డాకు పంపించడం 1995 నుంచి నిలిపి వేశారు. ముంబై నుంచి జెడ్డాకు యాత్రికులను చేరవేసే ఎంవీ అక్బరీ నౌక బాగా పాతదై ప్రయాణానికి అనుకూలంగా లేకపోవడంతో అప్పట్లో సముద్ర ప్రయాణాన్ని నిలిపేశారు. విమానయానం ద్వారా వెళ్లే హజ్ యాత్రికులకు ఇచ్చే సబ్సిడీని 2022 నాటికి రద్దు చేయాల్సిందిగా సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం ప్రత్యామ్నాయ మార్గం కోసం చూస్తోంది.
సముద్రమార్గం ద్వారా హజ్‌కు!
Published Thu, Apr 6 2017 4:57 PM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
Advertisement