హెల్త్‌కేర్‌పై హెచ్‌సీఎల్ దృష్టి
న్యూఢిల్లీ: దేశీయ టెక్నాలజీ దిగ్గజం హెచ్‌సీఎల్ కార్పొరేషన్ తాజాగా హెల్త్‌కేర్ రంగంపై దృష్టిపెట్టింది. తొలి దశలో రూ. 1,000 కోట్లను ఇన్వెస్ట్ చేయనున్నట్లు పేర్కొంది. హెల్త్‌కేర్, వెల్‌నెస్ బిజినెస్‌ల ద్వారా 2020కల్లా 2 కోట్ల మందికి సేవలు అందించాలని భావిస్తున్నట్లు వివరించింది.
ఇందుకు హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఐటీ దిగ్గజ ం హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, పీసీ తయారీ సంస్థ హెచ్‌సీఎల్ ఇన్ఫోసిస్టమ్స్‌లలో హెచ్‌సీఎల్ కార్పొరేషన్‌కు మెజారిటీ వాటా ఉన్న సంగతి తెలిసిందే.దేశంలో ఉన్న 30 కోట్ల మంది పట్టణ మధ్య తరగతి జ నాభాపై హెచ్‌సీఎల్ కార్పొరేషన్ ప్రత్యేకంగా దృష్టి సారించనుంది. కాగా ఇప్పటికే ఆరోగ్య పరిరక్షణ సేవలను అందిస్తున్న భారత్ ఫ్యామిలీ క్లినిక్‌లో మెజారిటీ వాటాను హెచ్‌సీఎల్ హెల్త్‌కేర్ సొంతం చేసుకుంది.