కాళ్లున్న హెలికాప్టర్...
హెలికాప్టర్‌కు కాళ్లేంటి? ఇదిగో ఫొటోలో కనిపించడంలే.. ఇవి రోబో కాళ్లు! విమానాలతో పోలిస్తే.. హెలికాప్టర్లు మారుమూల ప్రాంతాలకు చొచ్చుకుపోతాయి.. భారీ రన్‌వేలాంటివి అవసరం ఉండదు. ముఖ్యంగా సహాయక చర్యల్లో ఇవి ఎంతో కీలకపాత్ర పోషిస్తాయి. అయితే.. సమతలంగా లేని ప్రాంతాలు, ఎగుడుదిగుడుగా ఉండే పర్వతాలు వంటి వాటిల్లో దిగాలంటే వీటికీ కష్టమే. ఈ ఇబ్బందులను తొలగించేలా అమెరికాకు చెందిన డార్పా(డిఫెన్స్ అడ్వాన్స్‌డ్ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ ఏజెన్సీ), జార్జియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీకి చెందిన శాస్త్రవేత్తలు రోబోటిక్ ల్యాండింగ్ గేర్‌కు రూపకల్పన చేశారు.
ఈ రోబో కాళ్ల సాయంతో హెలికాప్టర్లు పర్వత ప్రాంతాలతోపాటు వేగంగా కదిలే భారీ పడవలపైనా దిగగలవని వారు చెబుతున్నారు. సహాయక చర్యలతోపాటు సైనిక కార్యకలాపాలకు ఇవి ఎంతో సహాయకారిగా ఉంటాయని అంటున్నారు. దీని తాలూకు ప్రాథమిక నమూనాను ఇటీవల అట్లాంటాలో విజయవంతంగా పరీక్షించారు. దీనిపై మరిన్ని పరిశోధనలు అవసరమట.