బంగ్లాదేశ్ ఫిరోజ్పూర్ జిల్లాలోని హిందూ దేవాలయంపై ఆగంతకులు దాడి చేశారు. ఆ దాడిలో దేవతలు కాళీ, సరస్వతి విగ్రహలు ధ్వంసమైనాయి.
బంగ్లాదేశ్ ఫిరోజ్పూర్ జిల్లాలోని హిందూ దేవాలయంపై ఆగంతకులు దాడి చేశారు. ఆ దాడిలో దేవతలులు కాళీ, సరస్వతి విగ్రహలు ధ్వంసమైనాయి. ఈ మేరకు స్థానిక మీడియా బంగ్లాదేశ్ న్యూస్ 24 ఆదివారం ఇక్కడ వెల్లడించింది. ఆ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది. దాంతో దేశంలోని మైనారిటీలైన హిందువులు నిరసనకు దిగారు. దాంతో కొద్ది పాటి ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. దాంతో పోలీసులు రంగంలోకి దిగారు. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
నిందితులను సాధ్యమైనంత త్వరగా పట్టుకుంటామని పోలీసు ఉన్నతాధికారులు ఆందోళనకారులనుకు భరోసా ఇచ్చారు. దాంతో ఆందోళనకారులు తమ నిరసనను విరమించుకున్నారు. జనవరి 5న బంగ్లాదేశ్లో జరిగిన ఎన్నికలు ఏక పక్షంగా జరిగాయి. దాంతో విపక్షాలు ప్రభుత్వంపై కొంత గుర్రుగా ఉన్నాయి. ఈ నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాలలోని హిందూ దేవాలయాలపై దాడులు చేసేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని అధికారులు భావిస్తున్నారు.