
మరఠ్వాడా కీ షేర్నీ
ముంబై: వేదికపైకి యువ ఎమ్మెల్యే, దివంగత బీజేపీ నేత గోపీనాథ్ ముండే కుమార్తె పంకజ ముండే(35) ప్రమాణం చేసేందుకు వచ్చినప్పుడు స్టేడియం ఒక్కసారిగా కరతాళ ధ్వనులతో దద్దరిల్లింది. ‘కౌన్ ఆయా? మరాఠ్వాడా కీ షేర్నీ ఆయా(ఎవరొచ్చారు? మరఠ్వాడా సివంగి వచ్చారు)’ అనే నినాదాలతో హోరెత్తింది. ప్రమాణం చేస్తున్నప్పుడు ఆమె మెట్టింటి పేరైన పాల్వేని వదిలేసి ‘పంకజ గోపీనాథ్ ముండే’గానే తన పేరును పేర్కొన్నారు.