సరికొత్త హైదరాబాద్ను చూశారా? | Hyderabad roads turns into Street art, KTR shares pics | Sakshi
Sakshi News home page

సరికొత్త హైదరాబాద్ను చూశారా?

Published Sun, Nov 13 2016 7:38 PM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

సరికొత్త హైదరాబాద్ను చూశారా? - Sakshi

సరికొత్త హైదరాబాద్ను చూశారా?

హైదరాబాద్: తెలంగాణ రాజధాని హైదరాబాద్ సరికొత్త శోభను సంతరించుకుంటోంది. నగరంలోని పర్యాటక ప్రాంతాలు, వాటి సమీపంలోని భవనాలు సప్తవర్ణాలను పులుముకుంటున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ), ఆర్ట్ తెలంగాణ, కళాకృతి, స్ట్రీట్ ఆర్ట్ సంయుక్త ఆధ్వర్యంలో అక్కడి రోడ్లను స్ట్రీట్ ఆర్ట్ గా మార్చేశారు.
 
స్థానిక, జాతీయ, అంతర్జాతీయ కళాకారులు రెండు వారాలపాటు కష్టించి నెక్లెస్ రోడ్డులో ఈ కళాఖండాలను చిత్రీకరించారు. నివాస సముదాయాలతోపాటు రోడ్డు పక్కన గోడలపైనా అందమైన బొమ్మలను చిత్రీకరించారు. ప్రస్తుతానికి నెక్లెస్ రోడ్డుకే పరిమితమైన ఈ స్ట్రీట్ ఆర్ట్ నగరంలోని మిగతా పర్యాటక ప్రాంతాల్లోనూ చేపట్టాలని జీహెచ్ఎంసీ భావిస్తోంది. వీటికి సంబంధించిన ఫొటోలను మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రి కల్వకుంట్ల తారాక రామారావు(కేటీఆర్) ట్విట్టర్ ద్వారా షేర్ చేశారు. కనువిందైన బొమ్మలు వేసిన చిత్రకారులకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు. ఆ ఫొటోలు ఇవే..
 
 
 
 
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement