త్వరలోనే రాష్ట్రంలో పర్యటిస్తా: దిగ్విజయ్
రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌చార్జి దిగ్విజయ్‌సింగ్ త్వరలో రాష్ట్రంలో పర్యటించనున్నారు. రక్షణమంత్రి ఆంటోనీ అధ్యక్షతన ఏర్పాటైన… కమిటీ రాష్ట్రంలో పర్యటించి, ప్రజల మనోభావాలను నేరుగా తెలుసుకోవాలని పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ, సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు డిమాండ్ చేసిన… నేపధ్యంలో ఆంటోనీ కమిటీ సభ్యుడైన… దిగ్విజయ్ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. అయితే, పార్టీ ఇన్‌చార్జి హోదాలో కూడా వివిధ అంశాలపై స్థానిక నేతలతో చర్చించడం తన బాధ్యతని దిగ్విజయ్ సింగ్ ఢిల్లీలో చెప్పారు.
మంగళవారం తనను కలిసిన విలేకరుల ప్రశ్నలకు ఆయన … సమాధాన…మిచ్చారు. విభజన…పై అధిష్టానం నిర్ణయాన్ని ధిక్కరించేలా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్ రెడ్డి చేసే ప్రకటన…లపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. ఈ అంశాలపై ప్రశ్నిస్తున్న విలేకరులపై ఒకింత ఆగ్రహం కూడా వెలిబుచ్చారు. గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్ర మోడీ పరిపాలనా దక్షతపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వై.ఎస్. జగన్ మోహన్‌రెడ్డి ప్రశంసను గురించి ప్రస్తావించగా, అది ఆయన చాయిస్ అనీ, దానిపై స్పందించబోనని దిగ్విజయ్‌సింగ్ చెప్పారు.