దేశీ విమానయానం 11% అప్ | IATA: Airlines Will Carry 3 Billion Passengers in 2013 | Sakshi
Sakshi News home page

దేశీ విమానయానం 11% అప్

Published Fri, Dec 6 2013 1:24 AM | Last Updated on Sat, Sep 2 2017 1:17 AM

IATA: Airlines Will Carry 3 Billion Passengers in 2013

న్యూఢిల్లీ: దేశీయ ఎయిర్ ట్రాఫిక్ అక్టోబర్ నెలలో 11.5% పెరిగిందని ఐఏటీఏ(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) తెలిపింది.  అయితే ఇది వృద్ధి కాదని గత ఏడాది అక్టోబర్‌లో ఎయిర్ ట్రాఫిక్ తక్కువగా ఉండడమే ఈ పెరుగుదలకు కారణమని వివరించింది. ఈ ఏడాది అక్టోబర్‌లో దేశీయ ఎయిర్‌ట్రాఫిక్ తీవ్ర ఒడిదుడుకులకు లోనైందని పేర్కొంది. ఐఏటీఏ వెల్లడించిన వివరాల ప్రకారం...,
 

  •  అక్టోబర్‌లో ప్యాసింజర్ లోడ్ ఫ్యాక్టర్(పీఎల్‌ఎఫ్) 1.4 శాతం వృద్ధితో 72.1 శాతానికి, ఎయిర్ కెపాసిటి 9.4 శాతానికి పెరిగాయి.
  •  ఆసియా-పసిఫిక్ ప్రాంతం, అమెరికా, యూరప్‌ల్లో ఆసియా-పసిఫిక్ ప్రాంతంలోనే అధిక ఎయిర్ ట్రాఫిక్ నమోదైంది.
  •  ఈ ఏడాది విమానయానం చేసే మొత్తం ప్రయాణికుల సంఖ్య 300 కోట్లకు చేరనున్నది. ఒక్క ఏడాదిలో ఇంత ఎక్కువ మంది విమానయానం చేయడం ఇదే మొదటిసారి.
  •  వచ్చే నెల 1 నాటికి వాణిజ్యపరమైన విమానయానం మొదలై వందేళ్లు పూర్తవుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement