ఐగేట్ టెక్నాలజీ నూతన అధ్యక్షుడు, కార్యనిర్వహాణాధికారిగా అశోక్ వేమూరి నియమితులైయ్యారు. ఈ మేరకు ఐ గేట్ టెక్నాలజీ సహా వ్యవస్థాపకుడు సునీల్ వాద్వానీ గురువారం ఇక్కడ వెల్లడించారు. అశోక్ తన పదవి భాద్యతలు సెప్టెంబర్ 16న స్వీకరిస్తారని తెలిపారు. కాగా ఐగేట్ టెక్నాలజీ సీఈవోగా పని చేసిన పణీష్ మూర్తి సహద్యోగితో అక్రమ సంబంధం నెరపాడని అభియోగం వెల్లువెత్తింది.
ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే మాసంలో పణీష్కు ఐగేట్ ఉద్వాసన పలికింది. దాంతో ఆ కంపెనీ తత్కాలిక పదవి బాధ్యతలను గెహర్డ్ వజినర్కు అప్పగిస్తున్నట్లు ఐగేట్ టెక్నాలజీ ప్రకటించింది. గతంలో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్లో విధులు నిర్వర్తించిన అశోక్ వేమూరి అనంతరం ఐ గేట్ టెక్నాలజీలో ప్రవేశించారు.