iGate
-
ఆర్నెల్లకే బోనస్... రూ. 1.10 కోట్లు
న్యూఢిల్లీ: ఐగేట్ సీఈఓగా చేరి ఆరునెలలు కూడా కాకముందే అశోక్ వేమూరి ఏకంగా 1.70 లక్షల డాలర్ల (సుమరు రూ.1.10 కోట్లు) బోనస్‌ను అందుకోనున్నారు. అమెరికా కేంద్రంగా పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ కంపెనీ ఐగేట్‌లో ఆయన గతేడాది సెప్టెంబర్‌లో చేరారు. ఆయన అమలు చేసిన వ్యూహాత్మక చర్యలతో డిసెంబర్ క్వార్టర్లో కంపెనీ ఆదాయం 10 శాతానికిపైగా పెరిగింది. పనితీరు ఆధారంగా ఇచ్చే వార్షిక ప్రోత్సాహకం 1.47 లక్షల డాలర్లతో పాటు వ్యూహాత్మక చర్యలకు మరో 28 వేల డా లర్లను అశోక్ వేమూరికి ఇస్తున్నట్లు కంపెనీ సోమవారం వెల్లడించింది. 2012 అక్టోబర్ -డిసెంబర్ త్రైమాసికంలో 27.16 కోట్ల డాలర్లుగా ఉన్న ఐగేట్ ఆదాయం 2013లో ఇదే కాలంలో 10.2% వృద్ధితో 29.93 కోట్ల డాలర్లకు చేరింది. ఐదేళ్ల ఒప్పందంతో ఐగేట్‌లో చేరిన అశోక్ వేమూరి వార్షిక వేతనం 13 లక్షల డాలర్లు. నగదు బోనస్ అదనం. -
ఐగేట్ నికర లాభం 7.5 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: అవుట్ సోర్సింగ్ సంస్థ ఐగేట్ గతేడాది డిసెంబర్‌తో ముగిసిన క్వార్టర్‌కు 3.31 కోట్ల డాలర్ల నికర లాభాన్ని ఆర్జించింది. అంతకు ముందటి ఏడాది ఇదే క్వార్టర్‌కు ఆర్జించిన నికర లాభం(3 కోట్ల డాలర్లు)తో పోల్చితే 7.5 శాతం వృద్ధి సాధించామని పేర్కొంది. నికర ఆదాయం 27 కోట్ల డాలర్ల నుంచి 10 శాతం వృద్ధితో 30 కోట్ల డాలర్లకు చేరాయని పేర్కొంది. ఉత్తర అమెరికా మార్కెట్లో భారీ డీల్స్ కారణంగా నికర ఆదాయం పెరిగిందని వివరించింది. ఈ సంస్థ జనవరి-డిసెంబర్ కాలాన్ని ఆర్ధిక సంవత్సరంగా పాటిస్తుంది. గతేడాది కంపెనీ పనితీరు పట్ల కంపెనీ ప్రెసిడెంట్, సీఈవో అశోక్ వేమూరి సంతృప్తి వ్యక్తం చేశారు. గతేడాది భారీ డీల్స్‌ను సాధించామని సంతోషం వ్యక్తం చేశారు. 9 మంది కొత్త క్లయింట్లు లభించారని, వీటిల్లో ఐదు ఫార్చ్యూన్ 1000 కంపెనీలు ఐదున్నాయని వివరించారు. ఇక పూర్తి సంవత్సరానికి కంపెనీ నికర లాభం 10 కోట్ల డాలర్ల నుంచి 36 శాతం వృద్ధితో 13 కోట్ల డాలర్లకు, నికర ఆదాయం 107 కోట్ల డాలర్ల నుంచి 8 శాతం వృద్ధితో 115 కోట్లకు పెరిగాయి. -
ఐగేట్‌పై ఫణీష్ మూర్తి దావా
బెంగళూరు: సహోద్యోగినితో సన్నిహిత సంబంధాల ఆరోపణల మీద ఐగేట్ సీఈవో పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఫణీష్ మూర్తి తాజాగా కంపెనీపై దావా వేశారు. తాను సదరు ఉద్యోగినితో సంబంధాలను కంపెనీకి తెలియజేయలేదన్న ఆరోపణలు అవాస్తవమని ఆయన పేర్కొన్నారు. ఈ విషయం గురించి తెలుసునంటూ ఒక స్వతంత్ర డెరైక్టరు రాసిన లేఖ తన వద్ద ఉందని ఫణీష్ మూర్తి వివరించారు. కంపెనీ కావాలనే తనను తొలగించడానికి నిబంధనల దుర్వినియోగానికి పాల్పడిందని పేర్కొన్నారు. మరోవైపు, కంపెనీతో ఒప్పందం ప్రకారం తనకు రావాల్సిన 5,27,000 స్టాక్స్‌ని కూడా ఐగేట్ తొక్కిపెట్టి ఉంచిందన్నారు. వీటి విలువ 1.7 కోట్ల డాలర్లు ఉంటుందని మూర్తి వివరించారు. ఈ షేర్లను విక్రయించాలని అనుకున్నా.. ఇది ప్రతికూల సంకేతాలు పంపుతుందంటూ బోర్డు అభ్యర్థించడం వల్ల ఆ యోచన గతంలో విరమించుకున్నానని ఆయన చెప్పారు. తాను ఎంతో శ్రమపడి సంస్థను అభివృద్ధి చేశానని, కానీ కంపెనీ మాత్రం ఒప్పందాన్ని గౌరవించకుండా వ్యవహరించడం మంచి పద్ధతి కాదని ఫణీష్ మూర్తి తెలిపారు. అటు, ఐగేట్ మాత్రం ఫణీష్ మూర్తి ఆరోపణలను తోసిపుచ్చింది. ఆయన వాదనల్లో ఎలాంటి పస లేదని కొట్టి పారేసింది. -
ఐగేట్ సీఈఓ అశోక్ వేమూరికి ఇన్ఫీకంటే రెట్టింపు ప్యాకేజీ
ముంబై: యూఎస్ కేంద్రంగా పనిచేస్తున్న ఐటీ సంస్థ ఐగేట్కు కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించిన అశోక్ వేమూరి భారీగా లబ్ధి పొందనున్నారు. ఇన్ఫోసిస్‌లో పొందిన జీతంతో పోలిస్తే భారీ ప్యాకేజీ లభించనుంది. ప్రాథమిక జీతం 1.3 మిలియన్ డాలర్ల(రూ. 8.2 కోట్లు)తోపాటు, మరో మిలి యన్ డాలర్ల(రూ. 6.3 కోట్లు) వరకూ వార్షిక నగదు బోనస్‌గా వేమూరి అందుకోనున్నారు. కాగా, ఇంతక్రితం ఇన్ఫోసిస్‌కు చెందిన అమెరికా మాన్యుఫాక్చరింగ్, ఇంజనీరింగ్ విభాగానికి గ్లోబల్ హెడ్‌గా విధులు నిర్వర్తించిన వేమూరికి 2012-13లో ప్రాథమిక జీతం కింద రూ. 3.89 కోట్లు, బోనస్‌గా రూ. 1.02 కోట్లు లభించింది. -
'ఐగేట్' సీఈవోగా అశోక్ వేమూరి
ఐగేట్ టెక్నాలజీ నూతన అధ్యక్షుడు, కార్యనిర్వహాణాధికారిగా అశోక్ వేమూరి నియమితులైయ్యారు. ఈ మేరకు ఐ గేట్ టెక్నాలజీ సహా వ్యవస్థాపకుడు సునీల్ వాద్వానీ గురువారం ఇక్కడ వెల్లడించారు. అశోక్ తన పదవి భాద్యతలు సెప్టెంబర్ 16న స్వీకరిస్తారని తెలిపారు. కాగా ఐగేట్ టెక్నాలజీ సీఈవోగా పని చేసిన పణీష్ మూర్తి సహద్యోగితో అక్రమ సంబంధం నెరపాడని అభియోగం వెల్లువెత్తింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది మే మాసంలో పణీష్కు ఐగేట్ ఉద్వాసన పలికింది. దాంతో ఆ కంపెనీ తత్కాలిక పదవి బాధ్యతలను గెహర్డ్ వజినర్కు అప్పగిస్తున్నట్లు ఐగేట్ టెక్నాలజీ ప్రకటించింది. గతంలో సాఫ్ట్వేర్ దిగ్గజం ఇన్ఫోసిస్‌లో విధులు నిర్వర్తించిన అశోక్ వేమూరి అనంతరం ఐ గేట్ టెక్నాలజీలో ప్రవేశించారు.