రాష్ట్రానికి ఇండియా టుడే అవార్డు
రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా పురస్కారం అందుకున్న మంత్రి కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రానికి ఇండియా టుడే సంస్థ ఇచ్చే ‘బెస్ట్ ఇన్‌క్లూజివ్ గ్రోత్ (ఉత్తమ సమ్మిళిత అభివృద్ధి)’ అవార్డు లభించింది. శుక్రవారం రాత్రి ఢిల్లీలో నిర్వహించిన కార్యక్రమంలో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్ చేతుల మీదుగా మంత్రి కె.తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమం, అభివృద్ధితో సమాజంలోని అన్ని వర్గాలను సమ్మిళితం చేస్తూ ముందుకు వెళ్లడాన్ని గుర్తించి ఈ అవార్డును అందచేశారని ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సీఎం కేసీఆర్‌కు, ప్రభుత్వం, ప్రజలకు ఈ అవార్డు దక్కుతుందని చెప్పారు.