లండన్ లో స్పానిష్ బ్యాంక్ దోపిడి కేసులో భారతీయుడి అరెస్ట్!
Published Sun, Sep 15 2013 6:12 PM | Last Updated on Fri, Sep 1 2017 10:45 PM
లండన్ లో స్పానిష్ బ్యాంక్ సాంటెండర్ ను దోచుకోవడానికి ప్రయత్నించిన ఓ భారతీయుడితో పాటు నలుగురిని యూకే పోలీసులు అరెస్ట్ చేశారు. కంప్యూటర్లను హ్యాక్ చేసి స్పానిష్ బ్యాంక్ లో లక్షలాది పౌండ్లను దోచుకునేందుకు కుట్ర చేశారనే ఆరోపణలపై వీరిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఈ కేసులో అరెస్టైన ఆకాశ్ వాఘేలా, అసద్ ఆలీ ఖురేషి, లాన్నే ముల్లిన్స్ అబుదు, డీన్ ఓత్రాంలను శనివారం వెస్ట్ మినిస్టర్ మేజిస్ట్రేట్ కోర్టు ముందు ప్రవేశపెట్టారు. వీరిపై కుట్ర కేసు నమోదు చేసి డిస్టిక్ట్ జడ్జ్ హోవార్డ్ రిడిల్ రిమాండ్ కు పంపారు. మళ్లీ సౌతావార్క్ క్రౌన్ కోర్టు లో సెప్టెంబర్ 27 తేదిన మళ్లీ ప్రవేశపెట్టాలని కోర్టు ఆదేశించింది. అయితే వాఘేలాను సెప్టెంబర్ 27 తేది వరకు బెయిల్ పై విడుదల చేశారు.
ఈ కేసులో 12 మందిని అరెస్ట్ చేసి విచారించి.. ఆ తర్వాత నలుగురిపై కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ జరిగే వరకు మిగిలిన ఎనిమిది మందిని బెయిల్ పై విడుదల చేశారు.కీబోర్డు వీడియో మౌస్ ద్వారా బ్రాంచ్ లోని కంప్యూటర్లను రిమోట్ ద్వారా తమ ఆధీనంలోకి తీసుకోవడానికి సైబర్ గ్యాంగ్ ప్రయత్నించినట్టు విచారణలో తేలింది.
Advertisement
Advertisement