అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు | Indirect tax collection exceeds target by Rs 4000 crore in FY15 | Sakshi
Sakshi News home page

అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు

Published Fri, Apr 3 2015 1:00 AM | Last Updated on Tue, Oct 2 2018 4:19 PM

అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు - Sakshi

అంచనాలను మించిన పరోక్ష పన్ను వసూళ్లు

 న్యూఢిల్లీ: మార్చితో ముగిసిన 2014-2015 ఆర్థిక సంవత్సరంలో పరోక్ష పన్నుల వసూళ్లు రూ. 5,46,479 కోట్ల మేర జరిగాయి. ఇది సవరించిన అంచనా మొత్తం రూ.5,42,325 కోట్లతో పోలిస్తే రూ.4,000 కోట్లు అధికం. బడ్జెట్ అంచనా మొత్తం రూ.6,24,902 కోట్లతో పోలిస్తే మాత్రం ఈ సవరించిన అంచనా మొత్తం రూ.82,577 తక్కువ. 2014-15 ఆర్థిక సంవత్సరానికి రూ.6.24 లక్షల కోట్ల పరోక్ష పన్నుల వసూళ్ల లక్ష్యం సవాళ్లతో కూడుకున్న అంశమని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ పలు సందర్భాలలో అన్నారు.
 
 తదుపరి ఆ అంచనాల్ని సవరించారు. 2013-14లోని రూ.4,97,061 కోట్ల వసూళ్లతో పోలిస్తే 2014-2015లో వసూళ్లు 9.9% మేర పెరిగాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న 4.1 శాతం ద్రవ్యలోటు లక్ష్యాన్ని చేరుకోవడానికి అదనపు పన్నుల సమీకరణ తోడ్పడనుంది. ద్రవ్యలోటును ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 3.9 శాతానికి, వచ్చే ఆర్థిక సంవత్సరానికి 3.5 శాతానికి, 2017-18 ఆర్థిక సంవత్సరానికి 3 శాతానికి కట్టడి చేయాలని అరుణ్ జైట్లీ ప్రతిపాదించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement