టీటీడీ సభ్యురాలిగా సుధా నారాయణమూర్తి
అమరావతి : తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) పాలకమండలి సభ్యురాలిగా ఇన్ఫోసిస్ ఫౌండేషన్ చైర్ పర్సన్ సుధా నారాయణమూర్తిని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. తమిళనాడులో ఏసీబీ దాడుల్లో పదవి కోల్పోయిన శేఖర్ రెడ్డి స్థానంలో సుధా నారాయణమూర్తిని నియమించనున్నట్టు ప్రభుత్వం పేర్కొంది. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మాస్టర్స్ డిగ్రీని టెల్కోలో డెవలప్మెంట్ ఇంజనీరింగ్గా తన కెరీర్ ప్రారంభించారు.
బెంగళూరు యూనివర్సిటీలో కూడా ఆమె కంప్యూటర్ సైన్సును బోధిస్తున్నారు. అంతేకాక ఇన్ఫోసిస్ ఫౌండేషన్కు చైర్ పర్సన్గా ఆమె సేవలందిస్తున్నారు. గేట్స్ ఫౌండేషన్ ప్రజారోగ్యాల కార్యక్రమాలకు ఆమె ఓ సభ్యురాలుగా ఉన్నారు. కన్నడ, ఇంగ్లీష్లో ఆమె పలు రచనలు చేశారు. లోకోపకారిగా సుధా నారాయణమూర్తికి ఎంతో పేరొంది.