ఫేస్‌బుక్‌లో సమాచార సేకరణ టూల్
హూస్టన్: సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ జర్నలిస్టులకు సహక రించడం కోసం సమాచార సేకరణ టూల్‌ను ప్రవేశపెట్టింది. మీడియా రంగంలో ట్విటర్ ఆధిపత్యానికి అడ్డుకట్ట వేయడానికి ఈ చర్య తీసుకున్నట్లు కనబడుతోంది. ‘సిగ్నల్’గా పిలిచే ఈ టూల్ 150 కోట్ల మంది యూజర్లు, 30 కోట్ల మంది ఇన్‌స్టాగ్రామ్ యూజర్ల పోస్ట్‌ల నుంచి సమాచారాన్ని పొందుపరచడం, ఆధారం (సోర్స్) తెలపడం ద్వారా జర్నలిస్టులకు సహకరిస్తుంది. ఇది ఉచితం. మరో వారం తర్వాత ఫేస్‌బుక్ నుంచే జర్నలిస్టుల కోసం ‘మెన్షన్స్’ పేరిట పలు ప్రొఫైల్స్‌ను పొందుపరిచిన యాప్ విడుదల కానుంది.