83% క్షీణించిన ఐవోసీ నికర లాభం | IOC Q2 net profit dips 83 percent | Sakshi
Sakshi News home page

83% క్షీణించిన ఐవోసీ నికర లాభం

Published Sat, Nov 9 2013 3:12 AM | Last Updated on Fri, Nov 9 2018 5:30 PM

IOC Q2 net profit dips 83 percent

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ ఆయిల్ దిగ్గజం ఐవోసీ జూలై-సెప్టెంబర్(క్యూ2) కాలానికి నిరుత్సాహకర ఫలితాలను ప్రకటించింది. నికర లాభం 83% క్షీణించి రూ. 1,684 కోట్లకు పరిమితమైంది. ఇందుకు భారీగా ఏర్పడ్డ విదేశీ మారక నష్టాలకుతోడు, ఇంధన అమ్మకాలపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో నష్టపరిహారాన్ని సమకూర్చకపోవడం కారణమైంది. ప్రస్తుత సమీక్షా కాలంలో రూ. 2,158 కోట్లమేర విదేశీ మారక నష్టాలు నమోదుకాగా, గతంలో ఈ పద్దుకింద రూ. 2,289 కోట్ల లాభాన్ని అందుకున్నట్లు కంపెనీ చైర్మన్ ఆర్‌ఎస్ బ్యుటోలా పేర్కొన్నారు.  కాగా, ప్రస్తుత సమీక్షా కాలంలో టర్నోవర్ రూ. 1,06,001 కోట్ల నుంచి రూ.
  1,10,390 కోట్లకు పెరిగింది.
 
 డిజిన్వెస్ట్‌మెంట్‌కు నో : షేరు ధర కనిష్ట స్థాయిలో ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో డిజిన్వెస్ట్‌మెంట్ లో భాగంగా 10% వాటాను విక్రయించేందుకు ప్రభుత్వం సిద్ధపడటాన్ని కంపెనీ వ్యతిరేకిస్తోంది. ప్రస్తుతం స్టాక్ మార్కెట్లలో కంపెనీ షేరు రూ. 213 వద్ద కదులుతోంది. కాగా, కంపెనీలో వాటా విక్రయంపై డిజిన్వెస్ట్‌మెంట్ శాఖ ఈ నెలలో రోడ్‌షోలను నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement