ఆ ఇంటి పేరుంటే నేరమా?
న్యూఢిల్లీ: విమానాశ్రయంలో తనను పదేపదే అడ్డుకుంటున్నారని బీజేపీ ఎంపీ సునీల్ గైక్వాడ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఇంటి పేరు కారణంగానే ఎయిర్ పోర్టుల్లోని సెక్యురిటీ పాయింట్ల వద్ద తనను అడ్డుకుంటున్నారని వాపోయారు. తానొక ఎంపీనన్న సంగతి కూడా పట్టించుకోవడం లేదన్నారు. ఈ విషయాన్ని పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి జయంత్ సిన్హా దృష్టికి తీసుకెళ్లినట్టు తెలిపారు. గైక్వాడ్ అనే ఇంటిపేరు కలిగివుండడం నేరమా అని ప్రశ్నించారు.
ఎయిరిండియా ఉద్యోగిపై శివసేన రవీంద్ర ఎంపీ గైక్వాడ్ దాడి చేయడంతో విమానయాన సంస్థలు ఆయన పేరును బ్లాక్ లిస్టులో పెట్టాయి. విమానాల్లో ప్రయాణించకుండా ఆయనపై నిషేధం విధించాయి. ఈ నేపథ్యంలో గైక్వాడ్ ఇంటిపేరు కలిగిన ఎంపీ సునీల్ కు తిప్పలు తప్పడం లేదు.