ఇండియాలో 'పోర్న్' ఆపలేం!
న్యూఢిల్లీ: భారత్లో హింసాత్మకమైన సైబర్ పోర్నోగ్రఫీని నియంత్రించడం కష్టమని, దేశంలోని లైంగిక అసంతుష్ట పురుషుల నుంచి దీనికి భారీ డిమాండ్ ఉందని సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. , కామోద్రేక పూరితమైన, మహిళలపై హింసాపూరితమైన కంటెంట్ను వారు వీక్షిస్తున్నారని పేర్కొంది. భారత్ సైబర్ మార్కెట్ గణనీయమైన శక్తిగా ఉండటంతో దీనిపై సీమాంతర విద్రోహుల నుంచి తరచూ సైబర్ దాడులు జరుగుతున్నాయని తెలిపింది.
పోర్నోగ్రఫీకి భారీ డిమాండ్ ఉండటంతో ఒక వెబ్సైట్ను బ్లాక్ చేసినా ఇంటర్నెట్ కంటెంట్ ప్రోవైడర్స్ వెంటనే వేరే వెబ్సైట్ను ముందుకుతెస్తున్నారని, దీంతో దీనిని నిరోధించడం కష్టంగా మారిందని కేంద్ర దర్యాప్తు సంస్థ వివరించింది. సైబర్ లైంగిక నేరాలు, నేరగాళ్లపై దర్యాప్తు జరిపేవిధంగా సీబీఐను దేశవ్యాప్తంగా ఏకైక విచారణ సంస్థగా ఏర్పాటుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలైంది. దీనిపై సీబీఐ తన స్పందన తెలియజేస్తూ ఈ వివరాలు తెలియజేసింది.