జానారెడ్డిపై కాంగ్రెస్ నేతలు రుసరుస
హైదరాబాద్: తెలంగాణలో రైతాంగ సమస్యలపై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా శనివారం ప్రతిపక్షాలు చేపట్టిన రాష్ట్ర బంద్లో సీఎల్పీ నేత జానారెడ్డి పాల్గొనకపోవడం చర్చనీయాంశమైంది. బంద్లో జానారెడ్డి పాల్గొనకపోవడంపై కాంగ్రెస్ పార్టీలోనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కాంగ్రెస్ నేతలు జానారెడ్డిపై రుసరుసలాడుతున్నట్టు సమాచారం. అయితే అనారోగ్యం వల్లే బంద్లో పాల్గొనలేదని జానారెడ్డి చెప్పారు. బంద్ సందర్భంగా అరెస్ట్ అయిన నేతలను పరామర్శించేందుకు గోషామహల్ పోలీస్ స్టేషన్కు వెళ్లనున్నారు. హైదరాబాద్ సహా అన్ని జిల్లాల్లో ప్రతిపక్ష నాయకులు బంద్ చేపట్టారు. రైతుల రుణాలను ఒకే దఫా మాఫీ చేయాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి.