రూ.10 కోసం యువకుడు హత్య | Just for Rs 10, a man is killed in Bihar | Sakshi
Sakshi News home page

రూ.10 కోసం యువకుడు హత్య

Published Wed, Jan 8 2014 1:52 PM | Last Updated on Mon, Oct 8 2018 3:08 PM

Just for Rs 10, a man is killed in Bihar

ప్రపంచంలో ఎక్కడో అక్కడ ప్రతి రోజు అస్తులు, బంగారం... కోసం హత్య జరగడం సర్వసాధారణం. అయితే గుట్కా కొనుగోలు చేసేందుకు రూ. 10 ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు దీపక్ కుమార్ యాదవ్ (20) అనే యువకుడిని కత్తితో పొడిచి అతికిరాతకంగా హత్య చేశారు. ఆ సంఘటన బీహార్ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించింది. పోలీసుల కథనం ప్రకారం... బీహార్ రాష్ట్రంలోని కతిహర్ పట్టణంలో గుట్కా ప్యాకెట్ కొనుగొలు చేసేందుకు రూ.10 ఇవ్వాలని యాదవ్ ని నలుగురు వ్యక్తులు డిమాండ్ చేశారు.

 

అందుకు యాదవ్ నిరాకరించాడు. దాంతో ఆ నలుగురు ఆగ్రహంతో అతడిపై కత్తులతో దాడి చేసి అతికిరాతకంగా పొడిచారు. దాంతో  యాదవ్ అక్కడికక్కడే మరణించారని కతిహర్ జిల్లా ఎస్పీ అస్గర్ ఇమామ్ బుధవారం వెల్లడించారు. ఆ ఘటన తనను తీవ్ర అశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు. రూ.10ల కోసం మరి ఇంత దారుణమా అని వ్యాఖ్యానించారు.

 

యాదవ్ హత్యపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. నిందితులను సాధ్యమైనంత త్వరలో అరెస్ట్ చేస్తామని తెలిపారు. అయితే యాదవ్ హత్య స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. స్థానికులు పోలీసు కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు. ఆ ఘటనకు బాధ్యులపై వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు పోలీసులను డిమాండ్ చేశారు.ఆ ఘటన గత అర్థరాత్రి చోటు చేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement