టీవీ సీరియల్‌కు స్క్రిప్టు రాస్తున్న కరుణ
చెన్నై: డీఎంకే అధినేత కరుణానిధి 92 ఏళ్ల వయసులోనూ తన కలానికి పదును పెడుతున్నారు. ఆయన 11వ శతాబ్దికి చెందిన వైష్టవభక్తుడు రామానుజాచార్యుల జీవితంపై ప్రసారమవుతున్న మెగా టీవీ సీరియల్‌కు స్క్రిప్టు రాస్తున్నారు. ఈ సీరియల్ ఈ నెల 3నుంచి కలైంజర్ టీవీ చానల్‌లో ప్రారంభమైంది. 75 ఏళ్లుగా తమిళ సినిమాలకు, నాటకాలకు స్క్రిప్టులు సమకూరుస్తున్న కరుణ తన రచనా వ్యాసంగంపై తన అనుభవాలను ఇటీవల ఓ వ్యాసంలో వెల్లడించారు.
‘‘1942లో ద్రవిడనాడు అనే పత్రికలో నా తొలి వ్యాసం అచ్చయింది. డీకెంకే వ్యవస్థాపకుడు అన్నాదురై దీన్ని చదవి నన్ను చూడాలనుకున్నారు. నన్ను చూశాక రచయిత ఇంత చిన్న కుర్రాడా?’ అని ఆశ్చర్యపోయారు’’ అని తెలిపారు.