‘కేసీఆర్ ఫ్లెక్సీ’ మాయం | KCR flexy missing | Sakshi
Sakshi News home page

‘కేసీఆర్ ఫ్లెక్సీ’ మాయం

Published Sun, Jan 10 2016 5:26 AM | Last Updated on Tue, Aug 14 2018 11:24 AM

KCR flexy missing

వై.రామవరం : కాంట్రాక్ట్ ఉద్యోగుల పేరుతో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫొటోతో తూర్పు గోదావరి జిల్లా ఏజెన్సీ ప్రాంతమైన వై.రామవరంలో వెలసిన ఫ్లెక్సీ శనివారం తెల్లవారేసరికి మాయమయింది. స్థానిక ప్రభుత్వ కళాశాల కాంట్రాక్ట్ సిబ్బంది ఆ కళాశాల రోడ్డులో శుక్రవారం ‘తెలంగాణ ప్రాంత కాంట్రాక్ట్ ఉద్యోగుల సర్వీసులను క్రమబద్ధీకరణ చేసిన కేసీఆర్‌కు శతకోటి అభినందనలు’ అని రాసిన ఫ్లెక్సీ ఏర్పాటు చేసిన విషయం విదితమే.

ఇది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించినట్లుగా భావించిన టీడీపీ నాయకులు ఆ ఫ్లెక్సీని తొలగించాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అరుుతే అధికారులే తీరుుంచివేశారో, మరెవరైనా తొలగించారో తెలియదుగాని శనివారం తెల్లవారేసరికి ఫ్లెక్సీ మాయమయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement