నాతోని ఎన్ని తిట్టించిండ్రో... | TTdp leader reaction | Sakshi
Sakshi News home page

నాతోని ఎన్ని తిట్టించిండ్రో...

Published Sun, Oct 25 2015 4:04 PM | Last Updated on Tue, Aug 14 2018 10:54 AM

నాతోని ఎన్ని తిట్టించిండ్రో... - Sakshi

నాతోని ఎన్ని తిట్టించిండ్రో...

ఇదేం కొత్త సంగతో ఏమో...తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను డిక్షనరీలో లేని తిట్లు నాతో తిట్టించారు...ఇప్పుడేమో చంద్రబాబునాయుడు ఇంటికి వెళ్లి అమరావతి శంకుస్థాపనకు సాదరంగా ఆహ్వానించారు. అమ్మో ఈ కొత్త తిరకాసు ఏంట్రా బాబూ అని తెలుగుదేశం తెలంగాణ నేత ఒకాయన తెగ మదనపడిపోతున్నారు. ‘ఒక్క తిట్టా రెండు తిట్లా...నీ ఆలోచన...నీ మేధస్సు ఉపయోగించి తిట్టు అని చెప్పినోళ్లు...బాగా తిట్టినవన్న అని పొగిడినోళ్లు అందరూ కేసీఆర్ దగ్గరకు పోయిండ్రు...కేసీఆర్ ఏమో అమరావతి వెళ్లి అక్కడ జై కొట్టించుకుండు.

మధ్యలో మేము హవులాగాళ్లమై పోతిమి’ అని సదరు నేత సహచర నేతల దగ్గర వాపోతున్నారట. కేసీఆర్‌తో తగాదా పెట్టుకుంటే మనకు ఇక్కడ ఏదో ప్రెస్‌లో కనపడటానికి ఛాన్స్ ఉంటది ఇప్పుడు ఏం చేయాలి...ఎవరిని తిట్టాలంటూ ఆ నేత చిర్రుబుర్రులాడుతున్నాడట. కేసీఆర్, చంద్రబాబు కలయిక స్థానిక టీడీపీ నేతలు కొందరికీ అస్సలు మింగుడు పడుతలేదు. మరి కేసీఆర్ అంతు చూస్తాన్న రేవంత్‌రెడ్డి ఏమంటాడో...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement