గవర్నర్తో కేసీఆర్ భేటీ
హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గవర్నర్ నరసింహన్తో సమావేశమయ్యారు. మంగళవారం సాయంత్రం కేసీఆర్ రాజ్భన్కు వెళ్లి గవర్నర్తో భేటీ అయ్యారు.
యూనివర్సిటీల్లో వైస్ చాన్సలర్ల పదవుల ఖాళీల గురించి కేసీఆర్ గవర్నర్తో చర్చించారు. వైస్ చాన్సలర్ల నియామకాలతో పాటు యూనివర్సిటీల చట్టంలో మార్పులు, యూనివర్సిటీ అడ్మిషన్లు, హైకోర్టు విభజన, విద్యుత్ ఉద్యోగుల సమస్య తదితర అంశాల గురించి కేసీఆర్ చర్చించినట్టు సమాచారం.